ETV Bharat / state

పొందూరు అభివృద్ధికి కృషి చేస్తాం: తమ్మినేని సీతారాం

author img

By

Published : Dec 11, 2020, 5:40 PM IST

పొందూరు అభివృద్ధికి కృషి చేస్తామని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ మండల స్థాయి గిడ్డంగి ఎంఎల్​ఎస్ పాయింట్​ను సభాపతి ప్రారంభించారు.

speaker tammineni seetha ram inagurated MLS point in pondhuru
ఎంఎల్​ఎస్ స్టాక్ పాయింట్ ప్రారంభించిన సభాపతి

శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ మండల స్థాయి గిడ్డంగి ఎంఎల్​ఎస్ పాయింట్​ను సభాపతి తమ్మినేని సీతారాం శుక్రవారం ప్రారంభించారు. గత ప్రభుత్వం పొందూరులో ఉన్న ఎంఎల్​ఎస్ స్టాక్ పాయింట్​ను 4 ఏళ్ల క్రితం సిగడాం తరలించారని.. దీంతో కళాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని స్పీకర్ అన్నారు. శ్రీకాకుళం డివిజన్​లో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ పాలకొండలో విలీనం చేసి పొందూరుకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం పాలకొండ సబ్ డివిజన్​లో ఉన్న సబ్ స్టేషన్​ను శ్రీకాకుళానికి తిరిగి తీసుకొచ్చామని గుర్తు చేశారు. సిగడాం తీసుకువెళ్లిన ఎంఎల్​ఎస్ స్టాక్ పాయింట్​ను పొందూరు తీసుకొచ్చి ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు.

speaker tammineni seetha ram inagurated MLS point in pondhuru
పాఠశాలకు శంకుస్థాపన

పొందూరు ఖద్దరు అంటే ఆసియా ఖండంలోనే పేరు ఉందని.. అలాంటి పొందూరును భవిష్యత్తులో మంచి స్థాయికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తామని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. వైకాపా శ్రేణులు ఐకమత్యంగా పని చేయాలని కోరారు.

ఇదీ చదవండి: పోలవరంపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు: అనిల్ కుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.