ETV Bharat / state

కనీసం పట్టించుకోవడం లేదు.. కోటబొమ్మాళి వైసీపీలో ఓ వర్గం ఆవేదన

author img

By

Published : Jan 10, 2023, 8:12 PM IST

Mandal Parishad Plenary Meeting: అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయింపు, చేస్తున్న పనులు వివరాలపై తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని కొంతమంది ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు ఎంపీడీవో ఫణీంద్ర కుమార్​పై ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రోణంకి ఉమ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశంలో అధికార పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు నెలకొన్నాయి. దీంతో ఓ వర్గానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించి వాకౌట్ చేశారు.

Mandal Parishad Plenary Meeting as Rasabhasa
మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం రసాభాస

Mandal Parishad Plenary Meeting: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రోణంకి ఉమ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశంలో అధికార పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయింపు, చేస్తున్న పనుల వివరాలపై తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని కొంతమంది ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఎంపీడీవో ఫణీంద్ర కుమార్​ను గట్టిగా ప్రశ్నించారు. సమావేశాలకు పిలవడం తప్ప తమకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్ ఎంపీపీలు బోయిన నాగేశ్వరరావు, దుక్క రోజారాణితో పాటు ఓ వర్గానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించి వాకౌట్ చేశారు.

మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం రసాభాస

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.