ETV Bharat / state

రూ.25 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా పట్టివేత

author img

By

Published : Apr 27, 2021, 10:26 PM IST

గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న వాహనం
గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న వాహనం

పాలకొండ పరిధిలోని కార్గిల్ కూడలి వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ. 25 లక్షల విలువైన నిషేధిత గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని కార్గిల్ కూడలి వద్ద అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై సి.హెచ్ ప్రసాద్​కు అందిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేపట్టగా..ఒడిశాలోని రూర్కెలా నుంచి పైడిభీమవరానికి తరలిస్తున్న రూ. 25 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోని సంబంధిత శాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్

'18 ప్లస్​'కు టీకా రిజిస్ట్రేషన్.. మరికొద్ది గంటల్లో​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.