ETV Bharat / state

TDP Mini Mahanadu: 'సాక్షి పేపర్, న్యూస్‌ ఛానల్‌ జగన్​వి కాకుంటే ఉరి వేసుకునేందుకు సిద్ధం'

author img

By

Published : May 18, 2023, 12:29 PM IST

NTR Centenary Celebrations and Mini Mahanadu: సాక్షి పేపర్, న్యూస్‌ ఛానల్‌ మీవి కావని నిరూపిస్తే.. ఉరి వేసుకునేందుకు సిద్ధమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎం జగన్‌కు సవాల్‌ విసిరారు. మరోవైపు.. సత్యసాయి జిల్లా మడకశిరలో ఎన్టీఆర్ శత జయంతిని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని టీడీపీ నేతలు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే..

Etv Bharat
Etv Bharat

NTR Centenary Celebrations and Mini Mahanadu: సాక్షి పేపర్, న్యూస్‌ ఛానల్‌ మీవి కావని నిరూపిస్తే.. ఉరి వేసుకునేందుకు సిద్ధమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎం జగన్‌కు సవాల్‌ విసిరారు. శ్రీకాకుళంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు, మినీ మహానాడు కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, టీడీపీ సీనియర్ నేతలు పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు పై వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా.. తెలుగుదేశం 160 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు లాగే.. ఏపీలో కూడా మార్పు వస్తుందని అచ్చెన్నాయుడు అన్నారు. రేపో.. ఎల్లుండో.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అవుతాడన్న ఆయన.. తర్వాత తాడేపల్లి ప్యాలస్ తలుపులు కొడతారని అన్నారు. దీంతోపాటు అమరావతి, తెలుగు సంస్కృతి గురించి.. ఈ సైకో జగన్​కు తెలుసా అని.. టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు.. సీఎంను ప్రశ్నించారు. సైకో గురించి మేము చెప్పనక్కరలేదన్న ఆయన.. వైసీపీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ ఇద్దరూ గతంలో ఏమి మాట్లడారో.. అప్పటి పేపరు, టీవీల్లో వచ్చిన కథనాలు చూస్తే తెలుస్తోందన్నారు.

"టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఇబ్బంది పెట్టేందుకు.. ఆయనపై కేసులు పెట్టాలని జగన్​ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఆయనకు పేపర్, టీవీ ఛానల్​ ఉన్నా కూడా.. లేవని చెబుతున్నారు. సాక్షి పేపర్, న్యూస్ ఛానల్ జగన్​వి కావని నిరూపిస్తే నేను ఉరి వేసుకునేందుకు సిద్ధం. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా.. తెలుగుదేశం 160 స్థానాల్లో విజయం సాధించటం ఖాయం." - అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

శ్రీకాకుళంలో మినీ మహానాడు

మరోవైపు సత్యసాయి జిల్లా మడకశిరలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, గుండెమల తిప్పేస్వామితో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో.. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ పదవులు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దేనని పరిటాల సునీత తెలిపారు.

"బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ పదవులు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్​దే. పేదలు రెండు పూటలా అన్నం తినాలనే ఉద్దేశంతో కేవలం రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు." - పరిటాల సునీత, టీడీపీ మాజీ మంత్రి

సత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.