ETV Bharat / state

DHARMANA: 'అన్ని జిల్లాల అభివృద్ధే సీఎం లక్ష్యం'

author img

By

Published : Sep 1, 2021, 8:17 PM IST

రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటునకు కట్టుబడి ఉందని తెలిపారు. నారా లోకేశ్​, పవన్ కల్యాణ్​లు సీఎంను విమర్శించే నైతికత లేదన్నారు. సద్విమర్శలు చేస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Minister Dharmana Krishnadas
మంత్రి ధర్మాన కృష్ణదాస్

రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగపడే సూచనలు సలహాలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. లోటుపాట్లు ఉంటే ప్రభుత్వానికి తెలియజేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల టీటీడీసీలో ఐఎస్​ఎంఓ శిక్షణా కేంద్రం, సోలార్ సిస్టమ్​ను ప్రారంభించారు. సిడాక్ సంస్థ సౌజన్యంతో యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణతో పాటు, జాబ్​ మేళాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే పలాస, సోంపేట, రాజాం.. ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహించడం జరిగిందన్నారు.

మానవ వనరులను వినియోగించుకొనుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి. పార్లమెంటు నియోకవర్గం స్థాయిలో నైపణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవతంగా పనిచేస్తూ.. నిరుద్యోగాన్ని నివారించుటకు దోహదం చేస్తుంది. నరసన్నపేటలో నైపుణ్య అభివృద్ధి సంస్థ మంజూరు అయింది. బుడితిలో త్వరలో శిక్షణ ప్రారంభం అవుతుంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే ముఖ్య మంత్రి ఆశయం. పరిశ్రమలలో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు, చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు.. ఎన్నో నూతన చట్టాలను ప్రభుత్వం తీసుకు వచ్చింది. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళలకు అందించాం. అమ్మ ఒడి వంటి కార్య్రమాలను అమలు చేస్తూ పేదలకు ప్రభుత్వం అండగా ఉంది.: -ధర్మాన కృష్ణదాస్​, ఉప ముఖ్యమంత్రి

ఇదీ చదవండీ.. ఆమదాలవలస మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.