ETV Bharat / state

వర్షాలకు నీటిలోనే పంట.. 40 గ్రామాలకు రాకపోకలు బంద్

author img

By

Published : Oct 26, 2019, 3:29 PM IST

ఎడతెరిపి లేని వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో పంటపొలాలు నీట మునిగాయి. లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాంలో రహదారులు జలమయమయ్యాయి. ఎచ్చెర్ల పరిధిలో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

heavy-rains-in-srikakulam

వర్షాలకు నీటిలోనే పంట.. 40 గ్రామాలకు రాకపోకలు బంద్

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పరిధిలో ఎడతెరిపి లేని వర్షాలకు పంటపొలాలు నీట మునిగాయి. జల్లులు తగ్గినా... అనేక ప్రాంతాల్లో జరగకూడని నష్టం జరిగిపోయింది. పంటలు నీటమునిగి రైతులు లబోదిబోమంటున్నారు. లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లోని అనేక ప్రాంతాల్లో రహదారులు చిన్నపాటి నదులను తలపిస్తున్నాయి. ఎచ్చెర్ల పరిధిలో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచాయి. సుమారు 3 వేల 500 హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఇవి కూడా చదవండి:

బోరుబావిలో రెండున్నరేళ్ల బాలుడు.. రంగంలోకి ఐఐటీ​

Intro:AP_SKLM_21_26_Pantalku_Rhadharulku_Apaaranastham_AVBB_AP10139

అపార నష్టం

* 3500 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం
* 40 గ్రామాలకు వెళ్లే రహదారులు కొట్టుకుపోయాయి.
* నియోజకవర్గం ప్రజలు, రైతులు ఆందోళన

శ్రీకాకుళం జిల్లాలో గడిచిన మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం కావడంతోపాటు వివిధ రకాల పంటలకు, రహదారులకు అపార నష్టం వాటిల్లింది. ఎక్కడికక్కడ రహదారుల కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ప్రజలు అత్యవసర, నిత్యవసర సేవలు పూర్తిస్థాయిలో అందకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో రహదారులకు, పంటలకు అపార నష్టం వాటిల్లింది. జాతీయ రహదారి బుడుమూరు సంత కూడలి నుంచి సుమారు 20 గ్రామాలకు వెళ్లే రహదారి పాత రౌతుపేట, లక్ష్మీపురం వద్ద కొట్టుకుపోవడంతో ఆ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. రణస్థలం మండలం సంచాం, పైడిభీమవరం గ్రామాల మధ్య రహదారి కొట్టుకుపోవడంతో 15 గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతోపాటు నియోజకవర్గం పరిధిలో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు సుమారు 3,500 హెక్టార్లులో పూర్తిగా దెబ్బతిన్నాయి. కళ్లముందే పంటలు నాశనం కావడంతో రైతులు కంటతడి పెడుతున్నా రు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు వరద రూపంలో వచ్చి నాశనం చేసిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపోయిన పంటలను పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని నియోజకవర్గం రైతులు కోరుతున్నారు. నియోజకవర్గం పరిధిలో కొట్టుకుపోయిన రహదారులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


Body:పంటలకు అపార నష్టం


Conclusion:పంటలకు అపార నష్టం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.