ETV Bharat / state

'ఇంద్రపుష్కరిణిలో పిండప్రదానం చేయకూడదు'

author img

By

Published : Jan 10, 2021, 7:36 PM IST

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని ఇంద్రపుష్కరిణిలో ఆకులు కలిపారన్న విషయంపై ఈవో సూర్యప్రకాష్ మాట్లాడారు. అనుమతి లేని పనులు చేయటం విచారించాల్సిన విషయమన్నారు. ఇంద్రపుష్కరిణిలో పిండప్రదానం చేయకూడదని స్పష్టం చేశారు.

eo surya prakash
ఈవో సూర్యప్రకాష్

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆలయ పాలకమండలిలో ఓ సభ్యురాలి భర్త ఇంద్రపుష్కరిణిలో ఆకులు కలిపారని ఈవో సూర్యప్రకాష్‌ అన్నారు. తన అనుమతి లేకుండా గేట్లు తీసి ఇంద్రపుష్కరిణిలోకి వెళ్లారని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో విలేకర్ల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. గేట్లు తీసేసి లోపలకు వెళ్లడమనేది విచారించదగ్గ విషయమన్నారు. రానున్న రోజుల్లో ఇంద్రపుష్కరిణిలో ఎటువంటి అపచారాలు జరగకుండా ఆదేశాలు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ.. స్వామివారి కార్యక్రమాలు ఇంద్రపుష్కరిణిలోనే జరుగుతుంటాయని, అందులో పిండప్రదానం చేయకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయం సూపరింటెండెంట్‌ ప్రసాద్,‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆలయంలో అభివృద్ధి పనులకు భూమిపూజ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.