ETV Bharat / state

'చదువుతో పాటు... క్రీడల్లోనూ రాణించాలి'

author img

By

Published : Dec 28, 2019, 1:14 PM IST

శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో జరిగిన యువజనోత్సవాలకు సభాపతి తమ్మినేని సీతారాం ముఖ్యఅతిథిగా హజరయ్యారు. యువత చదువుతో పాటు... క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.

District level youth festivities in the Silver Jubilee Auditorium of Srikakulam Arts College
యువజనోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సభాపతి తమ్మినేని సీతారం, తదితరులు

'చదువుతో పాటు... క్రీడల్లోనూ రాణించాలి'

శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల సిల్వర్‌ జూబ్లీ అడిటోరియంలో... జిల్లాస్థాయి యువజనోత్సవాలు జరిగాయి. యువజన సర్వీసుల శాఖ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సభాపతి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. యువతలో సృజనాత్మకత వెలికితీయడానికి యువజనోత్సవాలు దోహదపడతాయని సభాపతి పేర్కొన్నారు. పుస్తకాలతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. అన్ని విషయాలపై జ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. జిల్లాస్థాయిలో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

'నేర రహిత జిల్లాగా తయారుచేయండి'

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.