ETV Bharat / state

'కొవిడ్​ విధుల్లో మరణించిన పోలీసులకు రూ.50 లక్షలు'

author img

By

Published : May 10, 2020, 2:12 PM IST

కొవిడ్​ విధి నిర్వహణలో పోలీసులు మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇస్తామని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్​ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని స్పష్టం చేశారు.

'కొవిడ్​ విధుల్లో మరణించిన పోలీసులకు రూ.50 లక్షలు'
'కొవిడ్​ విధుల్లో మరణించిన పోలీసులకు రూ.50 లక్షలు'

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన జిల్లా అధికారులతో అక్కడి పరిస్థితిని సమీక్షించారు. కొవిడ్​ సమయంలోనూ జిల్లా పోలీసులు బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.

పోలీసు సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్న ఆయన.. కొవిడ్​ విధి నిర్వహించి పోలీసులు ప్రాణాలు కోల్పోతే రూ.50 లక్షలు పరిహారం ఇస్తామన్నారు. కరోనా కట్టడికి దేశం తీసుకుంటున్న చర్యలు.. ఇతర దేశాలకు ఆదర్శంగా ఉన్నాయని డీజీపీ అన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమలకు మ్యాపింగ్​ చేస్తున్నామని చెప్పారు.

ఇదీ చూడండి:

గ్యాస్ లీకేజీకి కారణాలు బయటపెట్టాలి: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.