ETV Bharat / state

Devotee Builts Like Tirumala Temple in Palasa: శ్రీవారి దర్శనంపై భక్తుడి అసంతృప్తి.. పలాసలో తిరుమల తరహా ఆలయ నిర్మాణం

author img

By

Published : Aug 6, 2023, 12:57 PM IST

temple
temple

Devotee Builts Like Tirumala Temple: నిత్యం వేలాది భక్తులతో కిటకిటలాడే తిరుమల ఆలయంలో.. తనివితీరా శ్రీవారి దర్శనం చేసుకోలేకపోవచ్చు. అలా జరిగినప్పుడు మనమైతే మరోసారి వచ్చి శ్రీవారిని దర్శించుకుందామని సరిపెట్టుకుంటాం. అయితే ఆ భక్తుడు మాత్రం.. తిరుమల లాంటి ఆలయాన్నే పలాసలో కట్టిస్తున్నారు.

పలాసలో తిరుమల తరహా ఆలయ నిర్మాణం

Devotee Builts Like Tirumala Temple: శ్రీవారి దర్శనానికి నిత్యం వేల మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. భక్తజన సంద్రం తాకిడికి అందరికీ తనివితీరా స్వామివారి దర్శనం కలగకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మనమైతే ఏం చేస్తాం.. ఇంకోసారి వచ్చినప్పుడు కనులారా ఆ వైకుంఠనాథుడ్ని దర్శించుకుందామని సరిపెట్టుకుంటాం. కానీ పలాసకు చెందిన హరిముకుంద పండా కుటుంబం.. అందుకు పూర్తి భిన్నం. పదేళ్ల క్రితం తిరుమలకు వెళ్లినప్పుడు వెంకటేశ్వరుడి దర్శనం సంతృప్తికరంగా జరగకపోడవంతో.. తిరుమల లాంటి ఆలయాన్నే పలాసలో కట్టాలని సంకల్పించారు. ఆ మేరకు ఐదేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించారు. దాదాపు పూర్తికావచ్చిన ఆ దివ్యధామం విశేషాలు మనమూ తెలుసుకుందాం.

Venkateswara Swamy Temple at Palasa: అద్భుత నిర్మాణ కౌశలంతో రూపుదిద్దుకుంటున్న ఆలయాన్ని దగ్గరుండి మరీ కట్టిస్తున్న ఈయన పేరు హరిముకుంద పండా. ఒడిశా రాజ కుటుంబానికి చెందినవారు. పదేళ్ల క్రితం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్‌తో తిరుమలకు వెళ్లిన పండా.. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దర్శనం చేసుకునే సమయంలో ముందుకు తోసేయడంతో చాలా బాధ పడ్డారు. సంతృప్తికరంగా స్వామిని సేవించుకోలేక పోయానని ఆవేదన చెందారు. ఇంటికి తిరిగొచ్చాక ఈ విషయాన్ని తల్లి హరివిష్ణుప్రియకు చెప్పారు.

TTD Temple in Mumbai: నవీ ముంబయిలో తిరుమల శ్రీవారి ఆలయానికి భూమి పూజ

Old Man Building Temple Like Tirumala: దాదాపు 110 ఏళ్ల వయసుల్లోనూ నిత్యం అమ్మవారి ఆరాధన చేస్తూ, సాయం కోసం ఇంటికి వచ్చే వారికి దానధర్మాలు చేస్తూ జీవనం సాగించే హరివిష్ణుప్రియ.. ఏం చేద్దామా అని ఆలోచించారు. తన కుమారుడిలాగే సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండవచ్చని భావించారు. అలాంటి వారందరి కోసం తిరుమల ఆలయాన్ని పోలిన గుడి నిర్మించాలని సంకల్పించారు. అందుకోసం పలాసలో తనకున్న కొబ్బరి తోటలో 12 ఎకరాల స్థలం కేటాయించారు. తల్లి సూచనల ప్రకారం ఐదేళ్ల క్రితం శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామని హరిముకుంద తెలిపారు.

Lord Balaji Temple Construction at Palasa: ఎవరి దగ్గరా రూపాయి కూడా ఆశించకుండా.. సొంత నిధులతో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టిస్తున్నట్లు హరిముకుంద పండా వెల్లడించారు. తల్లి విష్ణుప్రియ వాస్తు శాస్త్రంలో నిపుణురాలు కావడంతో.. నిర్మాణ ప్రక్రియలో ఏ ఇంజినీరు సాయమూ తీసుకోలేదన్నారు. ఎక్కడ ఏ ఆలయ నిర్మించాలి, ఏ విగ్రహం ఎక్కడ ప్రతిష్టించాలన్న అన్ని రకాల వివరాలను తన తల్లే చెప్పారని ముకుంద అంటున్నారు.

Palasa Temple: దర్శనం తీరుపై భక్తుడి అలక.. పలాసలో తిరుమల ఆలయం

Temple Construction Like Tirumala: ఆలయంలో శిల్పకళకు అధిక ప్రాధాన్యాన్నిచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జైపూర్ నుంచి ఏకశిలా విగ్రహాలను తెప్పించి ప్రతిష్టించనున్నారు. భక్తులు స్నానాలు ఆచరించేందుకు ప్రత్యేకంగా కొలను నిర్మిస్తున్నారు. ఆర్చకుల నివాసాలు, వసతి గృహాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఉచితంగా వివాహాలు చేసుకునేందుకు వీలుగా కళ్యాణ మండపాన్ని కూడా కట్టిస్తున్నారు. ఆలయ పరిసరాల్ని పచ్చగా తీర్చిదిద్దారు.

Venkateswara Swamy Temple Construction: 90 ఏళ్లు పైబడినా ఇప్పటికే తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేవడం హరిముంకుంద పండా అలవాటు. నిద్రలేచి హోమయోగ కసరత్తులు చేస్తారు. తల్లి హరి విష్ణు ప్రియ సేవ పూర్తి చేసుకుని.. ఉదయం 8 గంటల నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆలయ నిర్మాణంలో నిమగ్నులవుతున్నారు.

తిరుమల తరహా శ్రీవారి ఆలయం.. సదుపాయాలు లేక ఇబ్బందులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.