ETV Bharat / state

క్వారంటైన్​ నుంచి యువతిని తీసుకెళ్లిన కానిస్టేబుల్​ సస్పెండ్​

author img

By

Published : Jun 7, 2020, 12:04 PM IST

సంతబొమ్మాళి మండలం లక్ష్మీపురం క్వారంటైన్ కేంద్రం నుంచి యువతిని తీసుకువెళ్లిన కానిస్టేబుల్ సత్యరాజును జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. క్వారంటైన్ కేంద్రంలో సౌకర్యాలు లేవన్న కారణంగా ఈమెను పోలీసు క్వార్టర్స్​కు తరలించడం పట్ల కుటుంబ సభ్యులు ఆగ్రహిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో కానిస్టేబుల్ పై వేటు పడింది.

constable suspended due to shifting a woman from quarantine to police quarters
సస్పెండ్​ అయిన సంతబొమ్మాళి మండలం కానిస్టేబుల్​ సత్యరాజూ

కోల్​కతా నుంచి ఫలక్​నామా రైలుపై వచ్చి... ఇచ్ఛాపురంలో దిగిన 15 మందిని అధికారులు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం లక్ష్మీపురం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అయితే కేంద్రానికి తరలిస్తున్న సమయంలో... వెళ్లే మార్గం తెలియక డ్రైవర్ ఇబ్బంది పడుతున్నాడని వాహనంలోని ఓ యువతి 100కు కాల్ చేసి చెప్పడం వల్ల సంతబొమ్మాళి పోలీసు కానిస్టేబుల్ సత్యరాజ్​కు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి సమాచారం అందింది. కానిస్టేబుల్ సాయంతో వారంతా అర్ధరాత్రి సమయంలో కేంద్రానికి చేరుకున్నారు.

constable suspended due to shifting a woman from quarantine to police quarters
సస్పెండ్​ అయిన సంతబొమ్మాళి మండలం కానిస్టేబుల్​ సత్యరాజూ

అయితే అక్కడ సదుపాయాలు లేవని ఆ యువతి సెల్ఫీ వీడియోను జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కరోనా సహాయ కేంద్రానికి అర్ధరాత్రి 2 గంటల సమయంలో పంపించింది. సంబంధిత కానిస్టేబుల్​కు కూడా వీడియో పంపటంతో ఆ సమయంలో ఆమెను పోలీసు క్వార్టర్స్​కి సత్యరాజ్​ తరలించాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు సమాచారం అందడం వల్ల వారు ఆగ్రహించి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై టెక్కలి ఆర్డీవో కిశోర్ విచారణ జరిపి జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్​ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన ఈ నెల 3వ తేదీన జరిగింది. విచారణ అనంతరం కానిస్టేబుల్​ను శనివారం సస్పెండ్ చేశారు.

ఇదీ చదవండి : డాక్టర్ సుధాకర్‌ కేసు: కేజీహెచ్‌లో సీబీఐ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.