శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అలుదు గ్రామంలో డ్రైనేజీ స్థలం ఆక్రమణలకు గురైందని, ఈ వ్యవహారంపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆ గ్రామానికి చెందిన బాబురావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మరోవైపు భారీ వర్షాలకు మురుగు నీరు, కొండపై నుంచి వచ్చే నీరు ఇళ్లలోకి ప్రవేశిస్తోందని, అసంపూర్తిగా మిగిలిన డ్రైనేజీ పనుల్ని పూర్తిచేసేలా అధికారుల్ని ఆదేశించాలని కోరుతూ... గరీబ్ గైడ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భార్గవి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై సంయుక్తంగా విచారణ జరిపిన ధర్మాసనం... నెల రోజుల్లో డ్రైనేజీ పనుల్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
ఇదీ చదవండీ... ఆస్తుల వేలం కొత్తది కాదు: మిషన్ బిల్డ్ ఏపీ డైరెక్టర్