ETV Bharat / state

నాడు ఎర్రన్న.. నేడు అచ్చెన్న.. నాకు అత్యంత ఆప్తులు: చంద్రబాబు

author img

By

Published : Mar 26, 2022, 3:48 PM IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్‌ నేత సోమిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అధినేత చంద్రబాబు. ఇరువురికి ఫోన్లు​ చేసిన చంద్రబాబు.. సంపూర్ణ ఆరోగ్యం, ఆనందాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

chandrababu birthday wishes to Atchannaidu and somireddy
అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలు

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాడు ఎర్రన్న.. నేడు అచ్చెన్న.. ఇద్దరూ తనకు అత్యంత ఆప్తులని చంద్రబాబు అన్నారు. అన్నకు తగ్గ తమ్ముడిగా.. తనకు కుడిభుజంగా ఉంటూ పార్టీకి, ప్రజలకు సేవలందిస్తున్న సోదరుడు అచ్చెన్నాయుడుని ప్రశంసించారు. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సైతం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు. సోమిరెడ్డి సంపూర్ణ ఆరోగ్య, ఆనందాలతో శతాయుష్కులై వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

పలాసలో ఘనంగా అచ్చెన్నాయుడి పుట్టినరోజు వేడుకలు: శ్రీకాకుళం జిల్లా పలాస తెలుగుదేశం కార్యాలయంలో కింజరాపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని.. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని చెప్పారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రతీ కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని అచ్చెన్న సూచించారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, పార్టీ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్ల సురేంద్ర, పార్టీ నాయకులు.. అచ్చెన్నాయుడిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి: Nakka Anand Babu: న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు సీఎం యత్నం: నక్కా ఆనంద్ బాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.