ETV Bharat / state

సిక్కోలులో ఘనంగా అంబేడ్కర్ జయంతి

author img

By

Published : Apr 14, 2021, 3:45 PM IST

Updated : Apr 14, 2021, 6:09 PM IST

శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేతలు అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలు కొనియాడారు.

Ambedkar Jayanti celebrations
సిక్కోలులో ఘనంగా అంబేద్కర్ జయంతి

అసమానతలు లేని సమాజ స్థాపనే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయమని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత‌ జయంతి సందర్భంగా.. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ కూడలిలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి.. కలెక్టర్‌ నివాస్​తో కలిసి నివాళులు అర్పించారు. ప్రపంచ చరిత్రలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జీవితం తెరిచిన పుస్తకం వంటిదన్నారు. నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు.. సర్వమానవాళి సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు అంబేద్కర్​ అని సభాపతి కొనియాడారు.

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆదర్శప్రాయుడని తేదేపా నియోజకవర్గ బాధ్యుడు నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ కూడలి ఎలాన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇతర దేశాలకు ఆదర్శంగా రాజ్యాంగాన్ని తీర్చిదిద్దడంలో అంబేద్కర్ కి ఎవరు సాటి లేరని ఆయన కొనియాడారు. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల సభపై రాళ్ల దాడిని ఈ సందర్భంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కర్ణ అప్పలనాయుడు తోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలను.. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేశారు. చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఆమదాలవలసలో అంబేడ్కర్ జయంతి..

ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకలు కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని దళిత సంఘం జిల్లా నాయకులు బేస్ మోహన్ రావు పిలుపునిచ్చారు. మునగవలస గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ కమిషనర్ ఎం.రవి సుధాకర్ రైతు బజార్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జనసేన నివాళులు

కులం పునాదుల మీద దేన్ని నిర్మించలేమని జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు అన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జనసేన, మండల భాజపా అధ్యక్షులు అప్పారావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో...

దళితులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని జిల్లా కాంగ్రెస్ నాయకులు సనపల అన్నాజీరావు అన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సమరం శత సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల నర్సింగరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం సభ్యులు రవి, రమేష్, యువకులు పాల్గొన్నారు.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నారాయణరావు, విజయ్ కుమార్, నవీన్ ప్రసాద్, ఎస్సీ ఎస్టీ మండల అధ్యక్షులు చిన్నారావు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల తెదేపా అధ్యక్షులు నూక అప్పలసూరన్నాయుడు (రాజు) ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఇవీ చూడండి:

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అంబేడ్కర్‌ 130వ జయంతి వేడుకలు

Last Updated : Apr 14, 2021, 6:09 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.