ETV Bharat / state

హిందూపురంలో టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నిరసన.. 'గో బ్యాక్‌ సీఎం జగన్‌' అంటూ నినాదాలు

author img

By

Published : Jun 14, 2022, 10:19 AM IST

TNSF PROTEST: శ్రీ సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన సందర్భంగా హిందూపురంలో తెలుగునాడు విద్యార్థుల ఫెడరేషన్ (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) ​విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిన జగన్‌ పదవి నుంచి వైదొలగాలంటూ నిరసన తెలిపారు.

TNSF PROTEST
హిందూపురంలో టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నిరసన

TNSF PROTEST: శ్రీ సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన సందర్భంగా హిందూపురంలోని అంబేడ్కర్‌ కూడలి వద్ద తెలుగునాడు విద్యార్థుల ఫెడరేషన్ (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) ​ విద్యార్థి సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు అన్యాయం చేశారని గో బ్యాక్‌ సీఎం జగన్‌ అంటూ నినాదాలు చేశారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాను అట్టడుగు స్థాయికి దిగజార్చి ఏ మెుహం పెట్టుకొని వస్తున్నారంటూ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిన జగన్‌ పదవి నుంచి వైదొలగాలంటూ నిరసన తెలిపారు.

హిందూపురంలో టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నిరసన

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.