ETV Bharat / state

చంద్రబాబు రాజకీయాల ముందు.. జగన్​ అమూల్​ బేబీ : నారా లోకేశ్​

author img

By

Published : Mar 25, 2023, 8:44 PM IST

Nara Lokesh Yuvagalam
యువగళం పాదయాత్ర

50th Day Of Yuvagalam Padayatra : నారా లోకేశ్​ తలపెట్టిన యువగళం పాదయాత్ర.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కొనసాగుతోంది. పాదయాత్రలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొంటుండగా.. లోకేశ్​ దారి పొడవునా వారిని పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. నేటితో పాదయాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎవరూ జగన్​ను నమ్మడం లేదని.. వైసీపీ పని అయిపోయిందని లోకేశ్​ స్పష్టం చేశారు. నారా లోకేశ్ సోదరుడు, నటుడు నారా రోహిత్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీల గెలుపుతో టీడీపీ ప్రభంజనం మెుదలైందని రోహిత్​ వెల్లడించారు.

చంద్రబాబు రాజకీయాల ముందు.. జగన్​ అమూల్​ బేబీ : నారా లోకేశ్​

Nara Lokesh Yuvagalam Padayatra : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల దెబ్బకు దెందులూరులో జరిగిన సభలో.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్​ రెడ్డికి మాటరాలేదని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. లోకేశ్‌ తలపెట్టిన యువగళం పాదయాత్ర శనివారంతో 50రోజులు పూర్తి చేసుకుంది. పుట్టపర్తి నియోజకవర్గంలో కొనసాగిన యాత్రలో.. భారీ సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. పాదయాత్ర 50వ రోజుకు చేరుకున్న సందర్భంగా నారా రోహిత్‌ యాత్రలో పాల్గొన్నారు. యువగళంలో లోకేశ్​తో పాదం కలిపిన రోహిత్ యాత్రకు​ తన సంఘీభావాన్ని తెలిపారు.

టీడీపీ జాతీయ ప్రధాన కారదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 50వ రోజు పుట్టపర్తి నియోజకవర్గంలో జోరుగా సాగింది. మూడు రోజుల విరామం తరువాత ఓబులదేవరచెరువు నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు. దారి పొడవునా స్థానికుల్ని పలకరిస్తూ యాత్రను కొనసాగించారు. ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ ముందుకు కదిలారు. సాయంత్రం పుట్టపర్తిలో జరిగిన బహిరంగ సభలో నారా లోకేశ్‌ పాల్గొన్నారు. సభకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు.

చంద్రబాబు రాజకీయం ముందు జగన్‌ రెడ్డి అముల్ బేబీ లాంటి వారని బహిరంగ సభలో లోకేశ్‌ వ్యాఖ్యానించారు. నెల్లూరు నుంచే జగన్‌కు పతనం మొదలవుతుందని గతంలోనే తాను చెప్పినని గుర్తు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదన్నారు. నారా లోకేశ్ సోదరుడు, నటుడు నారా రోహిత్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీల గెలుపుతో టీడీపీ ప్రభంజనం మెుదలైందని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉ‌న్నారని రోహిత్‌ అన్నారు.

"నారా చంద్రబాబు రాజకీయం ముందు ఈ జగన్​ ఎంత.. ఓ అమూల్​ బేబీ లాంటి వారు. జనం జగన్​ను నమ్మటం లేదు. కన్న తల్లి జగన్​ను నమ్మటం లేదు. ఆయన తోడబుట్టిన చెల్లి కూడా జగన్​ను నమ్మటం లేదు. వైసీపీ నేతలు, కార్యకర్తలు, నాయకులు జగన్​ రెడ్డిని నమ్మటం లేదు. నిన్న మొన్న చూశాం.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా జగన్​ను నమ్మటం లేదు. ఈయన అంటాడు.. సింహం సింగిల్​గా వస్తుందని. మొన్నటి ఎన్నికల వల్ల నిన్నటి సభలో సౌండ్​ రాలేదు."-నారా లోకేశ్​, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

"యువత, ప్రజలు తమ సమస్యలను బయట పెట్టటానికి యువగళం పాదయాత్రను ఒక వేదికగా తీసుకుంటున్నారు. యువగళం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలలో ఆదరణ పెరిగింది. ప్రజలలో మార్పు వచ్చింది. అది యువగళం పాదయాత్రలో మొన్న వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో, టీడీపీ సభలలో కనిపిస్తోంది."-నారా రోహిత్​, నటుడు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.