ETV Bharat / state

YSRCP MLA: వేరే సామాజిక వర్గమైతే గుప్తాను కొట్టేవారా..? త్వరలో సంచలన నిర్ణయం : వైకాపా ఎమ్మెల్యే

author img

By

Published : Dec 24, 2021, 9:57 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేసిన వ్యాఖ్యలు హాట్​ టాపిక్​​గా మారాయి. వైకాపా నేత సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనను ఖండించిన ఆయన.. సుబ్బారావు ఇతర సామాజిక వర్గమైతే సుభానీ కొట్టేవారా? అని ప్రశ్నించారు.

'ఇతర సామాజిక వర్గమైతే కొట్టేవారా ?'
'ఇతర సామాజిక వర్గమైతే కొట్టేవారా ?'

YSRCP MLA Anna Rambabu: ప్రకాశం జిల్లా గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైకాపా నేత సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనను ఖండించిన ఆయన.. సుబ్బారావు ఇతర సామాజిక వర్గమైతే సుభానీ కొట్టేవారా? అని ప్రశ్నించారు. గిద్దలూరు రాజకీయ పరిస్థితులపై సీఎంను కలిసి వివరిస్తానని అన్నారు. సీఎంను కలిసిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంటా అని వ్యాఖ్యనించారు. సొంత పార్టీ వారిని ప్రశ్నిస్తూ.. ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్​గా మారాయి.

గప్తా ఏమన్నారంటే..?
ఈ నెల 12న బాలినేని పుట్టినరోజు వేడుకల్లో.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లపై సుబ్బారావు గుప్తా వ్యాఖ్యలు చేశారు. వారి వ్యవహార శైలితో పార్టీకి తీరని నష్టం జరుగుతోందని అన్నారు. దీంతో ఆయనకు సొంత పార్టీలోని పలువురి నుంచి బెదిరింపులు అధికమయ్యాయి. ఈ క్రమంలోనే ఒంగోలు లంబాడీడొంకలోని ఆయన నివాసంపై ఈనెల 18న రాత్రి కొందరు యువకులు దాడి చేశారు. దీంతో సుబ్బారావు గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

అయితే.. ఈనెల 20న సుబ్బారావు గుప్తాకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. గుంటూరులోని ఓ లాడ్జిలో తలదాచుకుంటున్న గుప్తాపై మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ‘మోకాళ్ల మీద కూర్చో.. దండం పెట్టు..వాసన్నకు (మంత్రి బాలినేని) క్షమాపణ చెప్పు.. రెండు నిమిషాల్లో నరికేస్తాం.. నిన్ను..’ అంటూ గుప్తాను విచక్షణారహితంగా కొట్టడం తీవ్ర సంచలనం కలిగించింది. ఈనెల 19 సాయంత్రం ఈ ఘటన జరగ్గా సంబంధిత వీడియో 20న వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి :

Subbarao Gupta Attack: మంత్రి బాలినేనిని కలిసిన గుప్తా.. వివాదం సద్దుమణిగిందా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.