ETV Bharat / state

నిరూపయోగంగా సంపద తయారీ కేంద్రాలు..!

author img

By

Published : Jan 23, 2020, 7:06 PM IST

పెరిగిపోతున్న చెత్తకు పరిష్కారంగా... ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో లక్షలు వెచ్చించి సంపద తయారీ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ వాటి నిర్వహణను మరిచారు. ఫలితంగా కాలుష్యం పెరుగుతోంది. ప్రజల ఆరోగ్యం పాడవుతోంది.

yerragondapalem dust centers are not working in prakasham
నిరూపయోగంగా.. సంపద తయారీ కేంద్రాలు

నిరూపయోగంగా సంపద తయారీ కేంద్రాలు..!
పల్లెల్లో గుట్టలుగా పేరుకుపోతున్న చెత్తకు పరిష్కారం చూపేందుకు... ప్రభుత్వం సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో 16 కేంద్రాలను నిర్మించారు. ఏర్పాటు చేసి నెలలు గడిచినా... చెత్త సేకరణ జరగడంలేదు. ఫలితంగా సంపద తయారీ కేంద్రాలు నిరూపయోగంగా మారాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, గాజు సీసాలు, ఖాళీ కొబ్బరి బొండాలను కాల్చేయటంతో కాలుష్యం పెరుగుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి ఈ కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. ఇదీ చదవండి:

ఒంగోలులో వివాహితపై హత్యాచారం

Intro:FILENAME: AP_ONG_31_23_NIRUPAYOGANGA_CHETTA_SAMPADA_KENDRALU_VO_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

పల్లెల్లో లో బుట్ట లుగా పేరుకుపోతున్న చెత్తను పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో సేంద్రియ ఎరువు తయారీకి అనువుగా ఈ కేంద్రాలను నిర్మించారు. గ్రామాల్లో పోగైయ్యే చెత్తను వర్మి కంపోస్టు ఎరువు గా మార్చి పంచాయతీలకు ఆదాయం పెంచడం కూడా లక్ష్యం. యర్రగొండపాలెం మండలంలో 16 కేంద్రాలను నిర్మించారు. ఒక్కోదానికి 3 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉపాధి హామీ నిధులు ఖర్చు చేశారు. నిర్మాణాలు పూర్తయి నెలలు గడవడం, చెత్త సేకరణ లేకపోవడంతో సంపద తయారీ కేంద్రాలు అధ్వానంగా మారాయి. నిర్వహణ లేకపోవడం వల్ల నిరుపయోగంగా మారాయి. ఎర్రగొండపాలెం మేజర్ పంచాయతీలో చెత్త సంపాదన కేంద్రాలు దాదాపు పూర్తయ్యాయి. కేంద్రాల దగ్గర ప్లాస్టిక్ వ్యర్ధాలు, గాజు సీసాలు ఖాళీ కొబ్బరి బొండాల ను కాలేచేస్తున్నారు.దింతో కాలుష్యం ఏర్పడుతుంది.


Body:kit nom 749


Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.