ETV Bharat / state

పార్టీ సమావేశలకు వాలంటీర్లు మస్ట్​.. సర్క్యులర్​ జారీ

author img

By

Published : Jan 20, 2023, 9:22 PM IST

Minister Adimulapu Suresh
Minister Adimulapu Suresh

Minister Adimulapu Suresh: వచ్చే ఎన్నికల్లో నూతనంగా నియమించే పార్టీ కన్వీనర్లు, గృహ సారథులదే కీలక బాధ్యతని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో జరిగిన వైసీపీ కన్వీనర్ల సమావేశంలో అన్ని గ్రామాల నుంచి వాలంటీర్లు పాల్గొనాలని సర్క్యులర్​ జారీ చేశారు. దీంతో వాలంటీర్లు సమావేశానికి హాజరైనట్టు మీటింగ్ వద్ద గ్రూప్ ఫోటోలు దిగి అధికారులకు పంపించారు.

Minister Adimulapu Suresh: వచ్చే ఎన్నికల్లో నూతనంగా నియమించే పార్టీ కన్వీనర్లు, గృహ సారథులదే కీలక బాధ్యత అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద మండల స్థాయి వైసీపీ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కన్వీనర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. పార్టీపరంగా సమావేశం జరిగినా.. వాలంటీర్లు అన్ని గ్రామాల నుంచి తప్పకుండా హాజరుకావాలని మండలం పరిషత్ కార్యాలయం నుంచి సర్క్యులర్ జారీ చేశారు.

వాలంటీర్లు హాజరయ్యారా లేదా అనే విషయం మంత్రి వ్యక్తిగత సిబ్బందికి పంచాయతీ కార్యదర్శులు సమాచారం ఇవ్వాలని.. ఆ సర్క్యులర్​లో పేర్కొన్నారు. దీంతో ఈ సమావేశానికి అందరూ వాలంటీర్లు పాల్గొని మీటింగ్ వద్ద గ్రూప్ ఫోటోలు దిగి సమావేశానికి వచ్చినట్లుగా హాజరు వేయించుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి సురేష్ జనసేన అధినేత పవన్ కల్యాణ్​, చంద్రబాబు నాయుడుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

తొందరగా వెళ్లి ఫోటో గ్రూప్ దిగాలి..లేకుంటే గైహాజరేనటా : వాలంటీర్

ఆయన సీట్లలో పోటీ చేస్తాడో తెలీదు... ఎవ్వరితో పొత్తో తెలీదు. ఒక చెత్తో బీజేపీ, ఇప్పుడేమో టీడీపీ అంటున్నారు. దీనిగురించి మాట్లాడితే నా భాష మారుతుంది. ఇంకో ఆయన కాంగ్రెస్, టీఆర్ఎస్​తో పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు వదిలేశాడు. మీరు ఎంతమందితోనైనా పొత్తు పెట్టుకోండి మాకు బాధ లేదు. మీరు ఎవరండి జగన్ మోహన్ రెడ్డిని ఆపడానికి. -మంత్రి ఆదిమూలపు సురేష్

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.