ETV Bharat / state

ఒంగోలులో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

author img

By

Published : May 29, 2021, 6:18 PM IST

ఒంగోలు నగరంలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. 20 డివిజన్​లో 143 మంది లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు.

Distribution of house rails in AP
minister balineni srinivasa reddy

ఒంగోలు పట్టణంలోని 20వ డివిజన్ లో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 300 చదరపు అడుగులు ప్లాట్ ను కేవలం ఒక్క రూపాయికే అర్హులకు ఇచ్చేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని చెప్పారు.

ఒంగోలులో 4,128 మందికి వివిధ కేటగిరిలో టిడ్కో ఇళ్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి వివరించారు.. ప్రస్తుతం 20వ డివిజన్ లో 143 మందికి టిడ్కో పట్టాలు ఇచ్చామని వెల్లడించారు. యర్రజర్లలో 24 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. కొందరు ఉద్దేశపూర్వకంగా కోర్టుకు వెళ్లి ఆటంకాలు కలిగించారని మంత్రి విమర్శించారు. త్వరలోనే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతందని చెప్పారు.

ఇదీ చదవండి:

కరోనా రోగులకు యాంటిబాడీ కాక్​టెయిల్ ప్రయోగం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.