ETV Bharat / state

మహానాడు వేదిక కోసం స్థల పరిశీలన చేసిన తెదేపా నేతలు

author img

By

Published : May 15, 2022, 3:40 AM IST

TDP Mahanadu at prakasam district: తెలుగుదేశం పార్టీ మహనాడును ఈ ఏడాది ప్రకాశం జిల్లాలో నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు మహానాడు వేదిక కోసం శనివారం స్థల పరిశీలన చేశారు. తాజాగా.. గుళ్లాపల్లిలో వేదిక కోసం స్థలాన్ని పరిశీలించారు.

TDP Mahanadu in Prakasam district
ప్రకాశం జిల్లాలో తెదేపా మహానాడు

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న మహానాడు వేదిక కోసం ఆ పార్టీ నేతలు స్థల పరిశీలన చేశారు. ఒంగోలు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో సభ పెట్టాలని తొలుత నేతలు భావించారు. తాజాగా మద్దిపాడు మండలం గుళ్లాపల్లిలో వేదిక కోసం స్థలాన్ని పరిశీలించారు. గ్రోత్ సెంటర్​లోని మహి ఆగ్రోస్ పరిశ్రమలో భారీ షెడ్లు ఉన్నాయి. ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తే అనుకూలంగా ఉంటుందని నేతలు భావిస్తున్నారు.

వర్షం పడితే బహిరంగ ప్రదేశంలో ఇబ్బందులు తలెత్తుతాయనే.. ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. మహానాడు నిర్వహణకు పదహారు కమిటీలు ఏర్పాటయ్యాయని.. ఈ మేరకు వీరంతా త్వరలో వేదిక ప్రాంతంలో పనులు ప్రారంభిస్తారని నేతలు వెల్లడించారు. ఈనెల 27న 10 వేల మందితో ప్రతినిధుల సభ.. 28న దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారని నేతలు వెల్లడించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.