ETV Bharat / state

అవస్థల 'వసతి'...143 మందికి ఒకే మరుగుదొడ్డి..!

author img

By

Published : Sep 7, 2019, 6:40 AM IST

అవస్థల 'వసతి'...143 మందికి ఒకే మరుగుదొడ్డి..!

రాష్ట్రంలో నిరక్షరాస్యతను సున్నా చేసేందుకు చర్యలు చేపడతామని ప్రభుత్వాలు ఎన్నో మార్లు ప్రకటించినా... క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. నిరుపేద విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రభుత్వ వసతి గృహాలు పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. విద్యార్థులకు ఉచిత విద్య, వసతి లక్ష్యంగా ఏర్పాటుచేసిన సంక్షేమ వసతి గృహాలు అవస్థలకు మూలంగా మారాయి. ప్రకాశం జిల్లా కురుచేడు ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలురవసతి గృహం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

అవస్థల 'వసతి'...143 మందికి ఒకే మరుగుదొడ్డి..!
ప్రకాశం జిల్లా కురుచేడు గ్రామంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలురవసతి గృహం ఓ అద్దె భవనంలో నడుస్తుంది. ఆ వసతి గృహంలో మొత్తం మూడు మరుగుదొడ్డు ఉన్నా.. వాటిలో రెండు పాడైపోయాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్నది ఒక్కటే. వసతి గృహంలో ఉన్న 143 మంది విద్యార్థులకు ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉంది. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే గంటల తరబడి వరుసలో నిలబడాల్సిందే. పరిస్థితి చేదాటిపోతే చెంబుచేత పట్టుకొని బహిర్భూమికి పరుగులు పెట్టాల్సిందే.

అపరిశుభ్రత

వసతి గృహనిర్వాహునికి(వార్డెన్) ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. స్పందించిన దాఖలాలులేవని విద్యార్థులు వాపోతున్నారు. మరుగుదొడ్డి వసతిలేమితో పాఠశాలకు ఆలస్యంగా వెళ్లాల్సివస్తోందంటున్నారు. వసతి గృహాలే కానీ...ఒక్క వసతి సరిగ్గా ఉండదని పేర్కొంటున్నారు. వసతిగృహ పరిసరాలు అపరిశుభ్రత మారుపేరని, వంటగది, మరుగుదొడ్లు ఇలా ...వసతి గృహం మొత్తం అవస్థలకు నిదర్శంగా ఉందని విద్యార్థులు అంటున్నారు.

కనీస సదుపాయాల కొరత

విషజ్వరాలు ప్రబలి...తరచూ విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా... నామమాత్రపు మాత్రలు ఇస్తున్నారే తప్ప...పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించిన పరిస్థితులు లేవన్నారు. కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పటికే అధికారులు స్పందించి...కనీసం మరో మరుగుదొడ్డినైనా కట్టించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి :

Intro:AP_SKLM_24_06_sumudham_snaniki velli_edharu_yuvakulu_gallantu_av_AP10139

సముద్ర సాన్నాకి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బుడగట్ల పాలెం వద్ద సముద్ర స్నానాలకు వెళ్లి గల్లంతయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుప్పిలి గ్రామానికి చెందిన బోర రమణ (21), నిమ్మ సంతోష్(22)లుగా తెలిపారు. గల్లంతైన వారిని సముద్రంలో స్థానికులు, పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.Body:M.Latchumunaidu
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం
కిట్ నెంబర్ 817



యువకులు గల్లంతుConclusion:యువకులు గల్లంతు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.