ETV Bharat / state

మెరిసేదంతా బంగారమే అనుకున్న ఆర్ఎంపీ.. రోగుల్లా వచ్చి 20 లక్షలు కొట్టేశారు

author img

By

Published : Jan 13, 2023, 4:17 PM IST

నమ్మకం ప్రాణం లెక్క తంబీ
నమ్మకం ప్రాణం లెక్క తంబీ

Cheated With Fake Gold: ఆయన! కాస్తో..కూస్తో పేరున్న ఆర్ఎంపీ వైద్యుడు. రోగాల బారిన ఎలా పడొద్దో.. వివరిస్తూ, వైద్యం చేస్తుంటాడు. చాలా మందికి రోగులు కూడా ఆయన మాటలు విని.. అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాని ఓ రోజు.. రోగుల్లాగా వచ్చిన దంపతులు ఆ వైద్యుడి వద్ద చికిత్స చేయించుకున్నారు. ఆనక.. మాట మాట కలిపి..తమ వద్ద అనుకోకుండా వచ్చిన బంగారం ఉందని, దాన్ని అమ్మేందుకు భయమేస్తుందని చెప్పారు. దీంతో, తనకే ఆ బంగారం ఇస్తే.. తగినంత బంగారం ఇస్తానని, రూ 20 లక్షలు చెల్లించాడు ఆ డాక్టరు. తరువాత నిజం తెలిసి.. లబోదిబోమని తలబాదుకున్నాడు. అంతేగా మరీ..! అత్యాశకు పోతే..ఏమవుతుందో , ఎన్ని కథల్లో చదవలేదు. వైద్యుడి అదే జరిగింది.

ఏంటీ డాక్టరన్న నమ్మకం ప్రాణం లెక్క తంబీ అంటివీ..20 లక్షలు పోగొట్టుకుంటువీ..

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం తమ్మలూరు గ్రామానికి చెందిన సీతారామ స్వామి ఆర్ఎంపీగా ముండ్లమూరు గ్రామంలో స్థిరపడ్డారు. వైద్య వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వృత్తి వైద్యం కనుక ప్రవృత్తిగా అందరితో కలిసి మెలసి ఉంటాడు. ఇలా అనుకోకుండా.. గత ఏడాది ఏప్రిల్ నెలలో చికిత్స కోసం కంజులు పట్టుకొని అమ్ముకొని బతుకుతెరువు సాగించే దంపతులు.. ఆయన వద్దకు వచ్చారు. తన భర్తకు ఆరోగ్యం బాగోలేదని వైద్యం చేయాలని.. ఆ భార్యామణి డాక్టర్ ను కోరింది. అలా వైద్యం కోసం ఒక నెలలోనే నాలుగుసార్లు వైద్యుడ్ని కలిశారు ఆ దంపతులు. వైద్యం కోసం వచ్చినప్పుడల్లా, కంజుపిట్టలని ఫ్రీగా ఇచ్చేవారు. ఇలా వారివురి మద్య సంబంధాలు మెరుగుపడటంతో.. ఆ దంపతులు, డాక్టర్ సీతారామ స్వామి వద్ద ఓ విషయాన్ని చెప్పారు.

అసలు కథ మొదలైంది ఇలా....: చికిత్స కోసం పలుమార్లు వచ్చిన ఈ గుర్తు తెలియని దంపతులు.. సీతారామస్వామికి ఓ రహస్యాన్ని చెప్పారు. తమ బంధువుల పిల్లోడు కేరళలో ప్రొక్లెయిన్​ ఆపరేటర్​గా పని చేస్తుంటాడని.. అతనికి అనుకోకుండా కొంత బంగారం దొరికిందని తెలిపారు. ఆ అబ్బాయికి భయమేసి బంగారాన్ని అమ్మిపెట్టమని.. కోరాడని ఆ దంపతులు వైద్యుడికి వివరించారు. ఆ దొంగ బంగారాన్ని ఎక్కడ అమ్మాలన్నా ఇబ్బందిగా ఉందని.. మీరు తీసుకునే పనైతే తక్కువ ధరకు ఇప్పిస్తామని వారు చెప్పారు. దీంతో ఆర్ఎంపీ ముఖం వెలిగిపోయింది. ఆ బంగారాన్ని తనకే ఇవ్వాలని, మీరు బయట ఎక్కడ అమ్మినా ప్రమాదమని హెచ్చరించాడు.

దీంతో ఒకరికొకరు విశ్వాసం నెలకొల్పే మాటలు మాట్లాడుకున్నారు. డబ్బులు సిద్దం చేసుకుంటే. ఆ బంగారాన్ని తమకే ఇచ్చేస్తామని.. ఆ దంపతులు చివరిమాటలుగా చెప్పి, అక్కడ్నుంచి వెళ్లిపోయారు. తరువాత చౌకగా వస్తున్న ఆ బంగారాన్ని సొంతం చేసుకునేందుకు సుమారు 20లక్షల రూపాయలు సిద్ధం చేసుకున్న ఆర్ఎంపీ .. ఆ దంపతులు ఇచ్చి వెళ్లిన చారవాణికి ఫోన్ చేసాడు. వారు వెంటనే స్పందించి.. బంగారంతో తాము సిద్దంగా ఉన్నామని.. మీరు డబ్బు తీసుకొని చిత్తూరు జిల్లాలోని ఓ చెరువు వద్దకు వస్తే మీకు బంగారం ఇచ్చేస్తామని తెలిపారు. దీంతో ఆ ఆర్ఎంపీ తన బందువును వెంట బెట్టుకొని వారు చెప్పిన చోటుకు వెళ్లారు.

మోసం చేసిన బంగారు పూసల దండ: పథకం ప్రకారం ముందే అక్కడ ఉన్న యువకుడు వీరు వెళ్ళగానే ఓ మూటతో వచ్చి సంచిలో నుండి ఓ బంగారు పూసను తీసి పరిశీలించమని చెప్పాడు. వెంటనే ఆర్ఎంపీ డాక్టర్ తన వేలికి ఉన్న ఉంగరాన్ని యువకుడు ఇచ్చిన బంగారుపూసని పరిశీలించి నమ్మకం కుదిరాక డబ్బు అతని చేతికిచ్చాడు. ఆ యువకుడు అతని వద్ద ఉన్న బంగారు పూసల దండలున్న మూటను వారికిచ్చి ఇక్కడ ఎక్కువ సేపు ఉండకూడదంటూ, పోలీసులు తిరుగుతున్నారని, మీరు తొందరగా వెళ్లిపోవాలని జాగ్రత్తలు చెప్పి అక్కడ నుండి యువకుడు వెళ్ళిపోయాడు. ఆ మూటను తీసుకొని ఇంటికి వచ్చి. విప్పదీసి చూస్తే అది నకిలీ బంగారం అని వైద్యుడు గుర్తించారు. వెంటనే తాను ఫోన్ చేసిన నెంబర్ కు ఫోన్ చేయగా, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎన్ని సార్లు చేసిన ఫోన్ నుంచి స్పందన లేకపోవడంతో.. తాను మోసపోయినట్లు తెలుసుకున్నాడు ఆర్ఎంపీ సీతారామ స్వామి. ఈ నెల 9వ తేదీన జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ ని కలసి తన గోడును వినిపించుకున్నాడు.

"పోయిన సంవత్సరం ఇద్దరు వ్యక్తుల ఆరోగ్యం బాగోలేక అలా రెండు, మూడసార్లు వచ్చి వైద్యం చేయించుకుని.. ఇలా మా బందువుల వద్ద బంగారం ఉంది అని.. తక్కువ ధరకు వస్తుందని నమ్మచెప్పి మదనపల్లె వస్తే మీకు బంగారం ఇస్తాం.. అనటంతో 20 లక్షల రూపాయలు పోగు చేసుకుని మదనపల్లె, బి.కొత్త కోట వీరంగి చెరువు వద్ద వాళ్లని కలిసి.. మొదట బంగారాన్ని చూపించి, మూటలో ఉన్నది మంచి బంగారమేనని చెప్పడంతో.. వాళ్లకి 20 లక్షలు అప్పజెప్పి.. మూటలో ఉన్న బంగారాన్ని ఇంటికి తీసుకుని వచ్చి చూడగా నకిలి బంగారమని తేలింది. ఈ నెల 9వ తేదీన జిల్లా ఎస్పీ గారిని కలసి నా గోడును విన్నవించుకున్నాడు." బాధితుడు సీతారామ స్వామి ఆర్ఎంపీ డాక్టర్

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.