ETV Bharat / state

ఏడేళ్ల బాలుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు

author img

By

Published : Mar 30, 2021, 10:44 AM IST

Police chaged the murder case
హత్య వివరాలు వెల్లడించిన పోలీసులు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సమీపంలో గల అన్నకుంట వద్ద ఈ నెల 23న జరిగిన ఏడేళ్ల బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు సంబంధించిన వివరాలను యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్​లో మార్కాపురం డీఎస్పీ కిశోర్ కుమార్ వెల్లడించారు.

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడుకు చెందిన లక్ష్మికి అదే గ్రామానికి చెందిన తుపాకుల శ్రీనుతో వివాహమైంది. వీరి కుమారుడు సాయికల్యాణ్ (7). అతను జన్మించిన రెండేళ్ల తర్వాత దంపతుల మధ్య విబేధాలు తలెత్తి విడిగా జీవిస్తున్నారు. దాచేపల్లి మండలం కేసనపల్లిలో ప్రకృతి వ్యవసాయ శాఖలో ఐసీఆర్​పీగా కాంట్రాక్ట్ ఉద్యోగినిగా లక్ష్మి పనిచేసేది. ఆ సమయంలో జేసీబీ నిర్వహించే తెలంగాణలోని నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం రంగంగుంట గ్రామానికి చెందిన జానా రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆదికాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఆ తర్వాత లక్ష్మి, జానా రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో కొద్దిరోజులు నివాసం ఉన్నారు. ఈ సమయంలో కొన్ని రోజులు మిర్యాలగూడలో, మరికొన్ని రోజులు దాచేపల్లిలోని కుమారుని వద్ద లక్ష్మి ఉండేది.

ఉద్యోగం వదిలి చీరలపై ఎంబ్రాయిడింగ్ చేసి..

దాచేపల్లి వెళ్లి ఉండటం జానారెడ్డికి ఇష్టం ఉండేది కాదు. కుమారుడిని వదిలి తనతోనే ఉండాలని పలుమార్లు కోరాడు. దీనికి ఆమె అంగీకరించక పోవటంతో చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉండడం క్షేమం కాదని భావించిన లక్ష్మి.. లాక్​డౌన్​కు ముందు కుమారునితో కలిసి యర్రగొండపాలెంలోని తన సోదరి వద్దకు వెళ్లింది. విధులను కూడా మండలంలోని యల్లారెడ్డిపల్లెకు మార్పించుకొని వై. పాలెంలో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటోంది. అనంతరం ఉద్యోగం వదిలి చీరలపై ఎంబ్రాయిడింగ్ చేసి.. తెలంగాణలోని మిర్యాలగూడలో విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఏడేళ్ల బాలుడిని నేలకేసి కొట్టి చంపారు..

జానా రెడ్డి యర్రగొండపాలెం వచ్చి కుమారుడిని వదిలి తనతో రావాలని.. లేకుంటే చంపుతానని ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. ఈ నెల 21న లక్ష్మి వస్త్రాలు కొనుగోలు చేసేందుకు సూర్యాపేట వెళ్లారు. ఇదే అదునుగా భావించి తమకు అడ్డుగా ఉన్న బాలుడు సాయికల్యాణ్​ను హత మార్చాలని జానారెడ్డి నిర్ణయించుకున్నాడు. అందుకు తన బంధువైన బ్రహ్మా రెడ్డి సహకారం కోరాడు. ఇద్దరూ కలిసి ఈ నెల 23న యర్రగొండపాలెంలోని లక్ష్మి అద్దెకు ఉంటున్న ఇంటి వద్దకు రాత్రి సమయంలో ద్విచక్ర వాహనం పై వెళ్లారు. అమ్మమ్మ కృష్ణవేణి వద్ద నిద్రిస్తున్న సాయి కల్యాణ్ ను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నారు. అన్నకుంట వద్దకు తీసి కెళ్లి అక్కడ చెట్ల చాటున బాలుని రెండు కాళ్లు పట్టుకుని నేల కేసి కొట్టారు. ఆ తర్వాత బండరాయితో తల పగలగొట్టడంతో సాయిక ల్యాణ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనపై ఈ నెల 24న పోలీసులకు ఫిర్యాదు అందింది. మార్కాపురం డీఎస్పీ కిశోర్‌కుమార్ పర్య వేక్షణలో సీఐ దేవప్రభాకర్ దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. నిందితులు జానారెడ్డి, బ్రహ్మారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చూడండి..: మార్టూరులో పోలీస్ రెస్ట్ హౌస్ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.