ETV Bharat / state

'దివ్యాంగుల సమస్యలు తీర్చాలి.. నెలకు రూ. 5 వేల పెన్షన్ ఇవ్వాలి'

author img

By

Published : Jun 18, 2020, 10:21 AM IST

ప్రకాశం జిల్లా కనిగిరిలో దివ్యాంగులు తమ నివాసాల్లో నిరసనలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలు చర్చించాలని డిమాండ్ చేశారు.

physically handicapped persons demands in prakasam dst kanigiri
physically handicapped persons demands in prakasam dst kanigiri

దివ్యాంగుల సమస్యలపై శాసనసభ సమావేశాల్లో చర్చించాలని నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో ఓ కమిటీ వేయాలంటూ.. ప్రకాశం జిల్లా కనిగిరిలో దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జునరావు డిమాండ్ చేశారు.

కనిగిరిలో ఆయన ఆధ్వర్యంలో దివ్యాంగులు... తమ ఇళ్లలోనే నిరసన చేశారు. 3 చక్రాల స్కూటర్ల కోసం దరఖాస్తులు చేసి ఏడాది గడుస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటివరకూ మంజూరు చేయలేదని చెప్పారు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 అమలు చేయాలని, తమకు రూ.5 వేల పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

గురువారం గవర్నర్​తో చంద్రబాబు భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.