ETV Bharat / state

ఉల్లి... కనీసం రెండు కిలోలు ఇస్తే బాగుండు..!

author img

By

Published : Nov 23, 2019, 3:51 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఉల్లి ధర పెరిగింది. ప్రభుత్వం రైతు బజార్లలో రాయితీపై అందిస్తున్న ఉల్లి కోసం ప్రజలు బారులుతీరారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో రైతు బజార్లకు నగరవాసులు క్యూ కట్టారు. కనీసం 2 కేజీలైన ఇస్తే బాగుండేదని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.

ఉల్లికోసం క్యూలైన్లో వేచి ఉన్న ప్రజలు

ఉల్లి... కనీసం రెండు కిలోలు ఇస్తే బాగుండు..!

ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న ఉల్లి కోసం ప్రజలు గంటలతరబడి వేచి ఉంటున్నారు. కేవలం ఒక కేజీ ఉల్లిపాయలు మాత్రమే ఇవ్వడం పట్ల నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు కిలోలైనా ఇస్తే వారం రోజులు ఇబ్బంది లేకుండా ఉంటుందని మహిళలు అంటున్నారు. బయట ఉల్లి కొనే పరిస్థితి లేదని... ప్రభుత్వం తగినంత సరఫరా చేయాలని కోరారు. కిలో ఉల్లి రూ.25కే రైతు బజార్లలో ఉదయం 7 గంటల నుంచి 10 వరకు, సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు అందిస్తున్నారు.

ఇదీ చూడండి

మనుషులు రావొద్దన్నారు... మృత్యువు రమ్మంది..!


Intro:AP_ONG_11_23_VULLLI_ON_RAITU_BHAJAR_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..............................................................................
ఉల్లి ధర ఘాటెక్కడంతో ప్రభుత్వం రైతు బజార్లలో రాయితీ తో అందిస్తున్న ఉల్లి కోసం ప్రకాశం జిల్లా ఒంగోలులో రైతు బజార్లకు నగరవాసులు క్యూ కట్టారు. కొత్తపట్నం బస్టాండ్, లాయర్ పేట రైతు బజార్లలో మహిళలు, వృద్దులు సైతం గంటల తరబడి వేచియుండి ఉల్లి తీసుకువెళ్లారు. గంటల తరబడి వేచియున్న కేవలం ఒక కేజీ ఉల్లిపాయలు మాత్రమే ఇవ్వడం పట్ల నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు కేజీలన్న అందిస్తే వారం రోజులన్న ఇబ్బంది లేకుండా ఉంటామని మహిళలు అంటున్నారు. బయట ఉల్లి కొనే పరిస్థితులు లేదని ప్రభుత్వం ప్రజల కష్టాలు అర్ధం చేసుకుని మరో కేజీ సరఫరా చేయాలని కోరారు. ప్రభుత్వం కేజీ 25 రూపాయల క్రింద రైతు బజార్లలో ఉదయం 7 గంటల నుంచి పది వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు రాయితీ తో ఉల్లి అందిస్తున్నారు....బైట్స్
నగర వాసులు



Body:ఒంగోలు


Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.