ETV Bharat / state

తుపాను ఎఫెక్ట్​ - తగ్గిన కూరగాయల దిగుబడి - సామాన్యుడిపై అధిక భారం

People Suffering Due to Increase in Vegetable Prices : మిగ్​జాం తుపాను కారణంగా పండించిన పంట నష్టపోయిన రైతుల కష్టాలను మాటల్లో చెప్పులేము. చేతికందిన పంట తుపానుకు బలైన రైతు బాధపడుతుంటే, మార్కెట్లో ఉత్పత్తి తగ్గి నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. దీని ప్రభావం మధ్య తరగతి ప్రజలపై పడింది. పెరిగిన ధరలతో కూరగాయలు కొనుగోలు చేయలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2023, 9:39 PM IST

market
market

People Suffering Due to Increase in Vegetable Prices : మొన్నటి వరకు టమాటా, ఉల్లి ధరల పెరుగుదలతో ఇబ్బంది పడిన ప్రజలు ప్రస్తుతం అన్ని కూరగాయలు ధరలు పెరగడం వల్ల అల్లాడిపోతున్నారు. మార్కెట్​కు​ వెళ్లి కూరగాయలు తీసుకురావాలంటే భయపడుతున్నారు. ఒకప్పుడు వంద రూపాయలకు ఐదు రకాల కూరగాయలను కొనుగోలు చేసేవారు. ఇప్పుడు అదేె వంద రూపాయలకు అసలు కూరగాయలు రావడం లేదని వాపోతున్నారు. ఒకవైపు ఆహార ద్రవ్యోల్బణం, మరోవైపు మిగ్​జాం తుపాన్​ కారణంగా కూరగాయలతో పాటు బియ్యం, పప్పు ధరలు కొండెక్కడం వల్ల సామాన్య ప్రజలు లబోదిబోమంటున్నారు.

తుపాను ఎఫెక్ట్​ - తగ్గిన కూరగాయల దిగుబడి - సామాన్యుడిపై అధిక భారం

Vegetable Prices in Ongole Market : మిగ్​జాం తుపాను కారణంగా ఒంగోలు మార్కెట్​లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ కారణంగా సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పొలాల్లోకి నీరు చేరుకుని పంట నష్టం వాటిల్లిన విషయం అందరికి తెలిసిందే. దీంతో కూరగాయల ఉత్పత్తి భారీగా క్షీణించాయి. జిల్లాలో 2,200 హెక్టార్లులో కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయల ధరలకు పూర్తిగా రెక్కలు వచ్చి ఆకాశాన్నంటాయని స్థానికులు వాపోతున్నారు. గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు అధిక ధరల ఉండటం వల్ల నెలకు రూ.1000 నుంచి రూ.1500 అదనంగా భారం పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ధరలు ఎప్పుడు లేవని వ్యాపారులు అంటున్నారు.

నువ్వా నేనా! అంటున్న ఉల్లి, టమాటాల ధరలు

Vegetable Prices : మార్కెట్లో అన్ని రకాల కూరగాయలకు గిరాకీ బాగా పెరిగింది. వ్యాపారులు రైతు బజార్​ మార్కెట్లో కంటే మరో 10 రూపాయలు అదనంగా రేటు పెంచి విక్రయిస్తున్నారు. ఫలితంగా సామాన్య ప్రజలు అధిక ధరలను వెచ్చించి కూరగాయలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

Farmers Affected by Cyclone : తుపాన్​ కారణంగా స్థానికంగా పంటలు దెబ్బతినడం వల్ల కూరగాయలను బెంగుళురు నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వ్యాపారులు పేర్కొన్నారు. కూరగాయల ధరలు కంటే అక్కడి నుంచి లారీల ద్వారా తీసుకువచ్చేందుకు అదనపు వ్యయం అవుతుందని తెలియజేశారు. మిగ్​జాం తుపాను ముందు వరకు అన్ని రకాల కూరగాయలు కలిపి రోజుకు 50 టన్నులు వస్తే, ఇప్పుడు మాత్రం 30 టన్నులే వస్తున్నాయన్నారు. గతంలో కిలో మునక్కాయలు 30 నుంచి 45 రూపాయలకు వరకు ఉంటే, ప్రస్తుతం రూ.200 వరకు ఉన్నాయని వ్యాపారులు తెలియజేశారు. బెండకాయలు, దొండకాయలు కిలో రూ.100 లు ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు.

Farmers are Facing Difficulties to Sell Vegetables: కూరగాయలు విక్రయించేందుకు వసతులు లేక రైతుల అవస్థలు.. ఎండలోనే తిప్పలు

Advice From Financial Experts : ప్రభుత్వం అతివృష్టిని, అనావృష్టిని తట్టుకునే విధంగా వంగడాలను ప్రోత్సహిస్తే ధరలను పెరుగుదలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం కూరగాయలకు వసూలు చేయగల గరిష్ఠ ధరలను నియంత్రణ అమలు చేయడం వల్ల సామాన్యులకు స్వల్పకాలిక ఉపశమనం కలుగుతుందని సలహా ఇచ్చారు. సరైన నిల్వ, సమర్థవంతమైన సరఫరా గొలుసు నిర్వహణ వల్ల ధరలను అదుపు చేయవచ్చని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.