ETV Bharat / state

ఒంగోలుకు మహర్ధశ.. భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్లుగా మాస్టర్‌ ప్లాన్‌

author img

By

Published : Nov 10, 2022, 4:45 PM IST

Master plan in Ongole: ఎట్టకేలకు ఒంగోలు నగరానికి మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమవుతోంది. ఒంగోలుతో పాటు, శివారులోని గ్రామాలను అనుసంధానం చేస్తూ... కొత్తగా మరో మినీ బైపాస్‌ రోడ్డును రూపొందిస్తూ ప్రణాళికలు తయారు చేశారు. 2040 సంవత్సరం నాటికి పట్టణ జనాభా, విస్తర్ణ దృష్టిలో పెట్టుకొని ఈ మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నామని నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గ సభ్యులు పేర్కొంటున్నారు. అయితే, భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్లుగా మాస్టర్‌ ప్లాన్‌లో ప్రణాళికలు లేవని స్థానికులు విమర్శిస్తున్నారు.

ఒంగోలు నగరానికి మాస్టర్‌
Master plan in Ongole

ఒంగోలు నగరానికి మాస్టర్‌ ప్లాన్​కు ప్రణాళికలు సిద్ధం

Master plan for Ongole: ఒంగోలు పట్టణానికి ఎట్టకేలకు మాస్టర్‌ ప్లాన్‌ తయారు కాబోతుంది.. కార్పొరేషన్‌ ఏర్పడి 10 ఏళ్ళు కావస్తున్నా, ఇంతవరకూ మాస్టర్‌ ప్లాన్‌ అంటూ తయారు చేయలేదు. ఒంగోలు పట్టణంతో పాటు, పలు విలీన గ్రామాలను అనుసంధానం చేస్తూ, కొత్తగా మరో మినీ బైపాస్‌ రోడ్డు కోసం ఈ ప్రణాళికలు తయారు చేశారు. అయితే మాస్టర్‌ ప్లాన్‌ విషయంలో నిర్ధిష్ట ప్రామాణికాలు, ప్రభుత్వ ఆస్తులు గుర్తించి వాటికి కాపాడే విధంగా ఎలాంటి ప్రణాళికలు రూపొందించారో తెలియడంలేదనే విమర్శలు వస్తున్నాయి.

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం అభివృద్ధి ఆశించిన స్థాయి స్థాయిలో జరగలేదు.. అస్తవ్యస్థ రహదారులు, మురికి కాలనీలు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, తాగునీటి వనరులను కాపాడుకోలేకపోవడం వంటి సమస్యలు పట్టణ ప్రజలను వేధిస్తున్నాయి. నగరపాలక సంస్థగా మారినా, అందుకు తగ్గట్టు సౌకర్యాలైతే కలగలేదు. పట్టణంలో దాదాపు 3లక్షల జనాభా ఉన్నా, అందుకు తగ్గట్టు కనీస సౌకర్యాలు కల్పన, విస్తరణ వంటివి జరగలేదు. పురపాలక సంస్థగా ఉన్న ఒంగోలు నగర పాలక సంస్థగా 10 ఏళ్ళ క్రితం మార్పు చేశారు. న్యాయపరమైన సమస్యల కారణంగా దాదాపు ఐదేళ్ళు ఎన్నికలు జరగలేదు. చుట్టు ప్రక్కల ఉన్న 8పంచాయితీలు ఒంగోలులో విలీనం చేసి, నగర పాలక సంస్థగా అప్‌గ్రేడ్‌ చేసినప్పటికీ పంచాయితీలు మాత్రం ఏ మాత్రం పట్టణాలు రూపుదాల్చలేదు. ఇంతవరకూ ఇందుకు తగిన ప్రణాళికలు రూపొందించలేదు.

'ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ఇప్పటివరకు.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. నగర పాలక సంస్థగా మారినా అందుకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. కొత్తగా.. మరో బైపాస్‌ రోడ్డు నిర్మాణం, నగర విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ వంటివన్నీ మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నాయి. వాగులు వంకల అక్రమణలను నిగ్గు తెల్చాల్సిన అవసరం ఉంది. మున్సిపల్‌ ఆస్తులు రంక్షిచుకునే విషయంలోగానీ, భావితరాల అవసరాలు తీర్చడానికిగానీ ప్రస్తుతం తయారు చేసిన ప్రణాళికల్లో ప్రాధాన్యం ఇవ్వలేదు.' - ప్రకాష్‌ రావు, స్థానికుడు

తాజాగా నగరపాలక సంస్థ అధికారులు ఒంగోలు పట్టణానికి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసారు. కొత్తగా మరో బైపాస్‌ రహదారి ఏర్పాటు, పట్టణం విస్తరించడం, రహదారులు, మురుగునీటి కాలువ నిర్మాణం, ప్రధానంగా శివారు కాలనీల్లో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు పరిష్కారం వంటివన్నీ మాస్టర్‌ ప్లాన్​లో ఉన్నాయి. అయితే మున్సిపల్‌ ఆస్తులు రంక్షిచుకునే విషయంలోగానీ, భావితరాలు అవసరాలు తీర్చడానికి గానీ ప్రస్తుతం తయారు చేసిన ప్రణాళికల్లో ప్రాధాన్యమివ్వలేదనే విమర్శలు ఉన్నాయి. పేర్నమెట్ట ప్రాంతం ఒంగోలు పట్టణంతో కలిసి ఉంటుంది. దీని పరిధిలో అత్యధికంగా స్థలాల క్రయవిక్రయాలు, నూతన భవనాలు నిర్మాణాలు అత్యధికంగా జరుగుతున్నాయి.. అయితే ప్లాన్‌ విషయంలో స్పష్టత లేదు. అదే విధంగా రెవెన్యూ పరంగా ఒంగోలుకు ఆనుకొని ఉన్న కొన్ని గ్రామాలు సంతనూతల పాడు ఎమ్మార్వో పరిధిలోకి వస్తుంది. ఒటింగ్‌, రికార్డులు పరంగా ఏదైనా సమస్య వస్తే ఒంగోలు పట్టణంలో ఉన్న వారు ఎస్ ఎన్ పాడుకు వెళ్ళాల్సి వస్తుంది.

ఒంగోలు కార్పొరేషన్‌ ప్రాంతాన్ని అంతా ఒక రెవెన్యూ ప్రాంతంగా గుర్తించి, రెండో మండల రెవెన్యూ అధికారిని ఏర్పాటు చేస్తే సమస్య ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాస్టర్‌ ప్లాన్‌ ను కూడా తయారు చేయాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. నగర పాలక సంస్థ మాత్రం ఎలాంటి అభ్యంతరాలు, సూచనలు ఉన్నా స్వీకరిస్తామని, తగిన మార్పులకు అవకాశం కల్పిస్తామని అంటున్నారు. 2040 సంవత్సరం నాటికి పట్టణ జనాభా, విస్తర్ణ దృష్టిలో పెట్టుకొని ఈ మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నామని నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గ సభ్యులు పేర్కొంటున్నారు. ఈ మాస్టర్‌ ప్లాన్‌ అమోదం పొంది.. దానికి తగ్గట్టు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే, ఒంగోలుకు మహర్ధశ ఏర్పడినట్లే.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.