ETV Bharat / state

Mother And Daughter Murder: టంగుటూరులో తల్లీ, కుమార్తె దారుణ హత్య

author img

By

Published : Dec 3, 2021, 9:44 PM IST

Updated : Dec 4, 2021, 7:56 AM IST

MOTHER AND DAUGHTER MURDER
MOTHER AND DAUGHTER MURDER

21:40 December 03

నగల కోసం ఘాతుకం

double murder: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. టంగుటూరులో తల్లి, కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నగలు చోరీ చేసిన దుండగులు.. శ్రీదేవి, ఆమె కుమార్తె వెంకటలేఖ గొంతు కోసి హత్య చేశారు. రాత్రి 8 గంటలకు పక్కింటివారితో మాట్లాడిన తల్లి, కుమార్తె.. మరో 20 నిమిషాల తరవాత ( 8.20 నిమిషాలకు) విగతజీవులుగా పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు.

mother and daughter murder: టంగుటూరులో నివాసం ఉంటున్న బంగారం వ్యాపారి జలదంకి రవికిషోర్‌ భార్య శ్రీదేవి(43), కుమార్తె వెంకట లేఖన(21)లను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. రవికిషోర్‌ సింగరాయకొండ రోడ్డులో ఆర్‌.కె. జ్యుయెలర్స్‌ పేరిట బంగారు దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయన రాత్రి 8.20 గంటల సమయంలో ఇంటికి వెళ్లి చూసేసరికి భార్య, కుమార్తె గొంతుకోసిన స్థితిలో, తీవ్ర రక్తస్రావమై అచేతనంగా పడిఉన్నారు. వెంటనే విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేశారు. వారి ద్వారా సమాచారం అందుకున్న ఎస్‌.ఐ. నాయబ్‌ రసూల్‌, సింగరాయకొండ సీఐ ఎం.లక్ష్మణ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లేఖన ప్రస్తుతం బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ హత్యలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు నేతృత్వంలో క్లూస్‌టీమ్‌ ఆధారాలు సేకరిస్తోంది. రవికిషోర్‌ సోదరుడు రంగాకు చెందిన బంగారు ఆభరణాల దుకాణంలో మూడు నెలల క్రితం సుమారు 800 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ కేసు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ఇంతలోనే అదే కుటుంబానికి చెందిన రవికిషోర్‌ భార్య, కుమార్తె హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: Students sick due to Food Poison: 100 మంది గురుకుల విద్యార్థినులకు అస్వస్థత.. కారణమేంటంటే..?

Last Updated : Dec 4, 2021, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.