ETV Bharat / state

సూరారెడ్డిపాలెం రైల్వేట్రాక్​పై ప్రేమజంట ఆత్మహత్య

author img

By

Published : Mar 23, 2021, 2:13 PM IST

Updated : Mar 23, 2021, 2:35 PM IST

ప్రకాశం జిల్లా టంగుటూరులో దారుణం జరిగింది. సురారెడ్డిపాలెం వద్ద రైల్వేట్రాక్​పై ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించరేమోనని ఆత్యహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

lovers commits suicide at surareddypalem railway track in prakasam district
రైల్వేట్రాక్​పై ప్రేమజంట ఆత్మహత్య

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద రైల్వేట్రాక్​పై ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఒంగోలు మండలం కొప్పోలుకు చెందిన విష్ణు వర్ధన్​రెడ్డి, వెంకటేశ్వర కాలనీకి చెందిన నాగినేని ఇందు కొద్ది రోజులుగా ప్రేమించుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు.

పెళ్లికి పెద్దలు అంగీకరించరేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. విష్ణు వర్ధన్​రెడ్డి ఇంజినీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థి. ఇందు డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని. ఇద్దరి మృతదేహాలు రైలు కింద పడిన తీరుకు.. శరీర భాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి:

జాతీయ రహదారిపై కారు దగ్దం..

Last Updated : Mar 23, 2021, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.