ETV Bharat / state

వెంగయ్య మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలి: పవన్ కల్యాణ్

author img

By

Published : Jan 18, 2021, 6:20 PM IST

అధికార పార్టీ ఎమ్మెల్యే తనను దూషించాడని మనస్తాపం చెంది ప్రకాశం జిల్లా సింగరపల్లిలో జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంగయ్య మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

JSP Pavan Kalyan
పవన్ కల్యాణ్

ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సింగరపల్లిలో జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్త బలవన్మరణానికి పాల్పడటం బాధాకరమన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలని అడగడం తప్పా అని ప్రశ్నించారు. వెంగయ్య మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. తమ కార్యకర్తను బెదిరించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఆరోపించారు. గిద్దలూరు ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: జిల్లాలో ఎన్టీఆర్ వర్ధంతి.. నేతల నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.