ETV Bharat / state

భారీ వర్షాలకు తెగిన చెరువుకట్ట.. రాకపోకలకు అంతరాయం

author img

By

Published : Sep 26, 2020, 12:12 PM IST

heavy rains in prakasam district
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు

ప్రకాశం జిల్లా చదలవాడలో భారీ వర్షానికి చెరువు కట్ట తెగి.. రాకపోకలకు అంతరాయం కలిగింది. స్థానిక సీఐ అక్కడకు చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు.

heavy rains in prakasam district
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చెరువు

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా చెరువు కట్ట తెగిపోయింది. చెరువులోని నీరంతా ఎస్టీ కాలనీలోకి చేరుతోంది. దీంతో చీరాల-ఒంగోలు మధ్య రాకపోకలకు ఆటంకం కలిగింది. చెరువు మధ్యలో జాతీయ రహదారి నిర్మించడం వలన వరద నీరు వెళ్లేందుకు మార్గం లేక ఇలా రోడ్డుమీదకు వస్తోందని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న ఒంగోలు గ్రామీణ సీఐ సుబ్బారావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తన సిబ్బందితో కలిసి రక్షణ చర్యలు చేపట్టారు. ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు నీటిలోకి ఒరిగిపోగా.. గమనించిన సీఐ ప్రయాణికులను కాపాడారు. స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి వాహనదారులకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.

heavy rains in prakasam district
వాగులో చిక్కుకుపోయిన బస్సు

ఇవీ చదవండి..

ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు..ఉప్పొంగిన వాగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.