ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో కొవిడ్ వాక్సినేషన్.. తొలిరోజు 967 మందికి టీకా

author img

By

Published : Jan 16, 2021, 5:40 PM IST

గత కొంత కాలంగా కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. అగ్రదేశాలకు ధీటుగా భారతదేశం కరోనా నియంత్రణ కొవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసి నేడు ప్రజలకు అందించింది. ప్రకాశం జిల్లాలో 22 కేంద్రాలలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. ఒంగోలు జీజీహెచ్​లో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కలెక్టర్ పోలా భాస్కర్ ప్రారంభించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములుకు వైద్యులు తొలి టీకా వేశారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గంలోని కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలను ప్రారంభించారు.

covid vaccination in prakasam
కొవిడ్ వాక్సినేషన్

గత కొంత కాలంగా కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. అగ్రదేశాలకు ధీటుగా భారతదేశం కరోనా నియంత్రణ కొవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసి నేడు ప్రజలకు అందిస్తోంది. ప్రకాశం జిల్లాలో 22 కేంద్రాలలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగింది. ఉదయం కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలో మొత్తం 24,000 మందికి టీకా ఇచ్చేందుకు గుర్తించామని.. అయితే తొలి రోజు 20 శాతం మంది దాదాపు 967 మందికే వాక్సిన్ ఇచ్చామని తెలిపారు.

ggh superintend
తొలి టీకా వేసుకున్న జీజీహెచ్ సూపరింటెండెంట్

ఒంగోలులో కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ప్రారంభించారు. జిల్లాలో మొదటి కొవిడ్ టీకా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు వేయించుకున్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గంలోని కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, వైద్యులు కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.

చీరాలలో..

chirala mla
టీకాను ప్రారంభిస్తున్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి

కరోనా వాక్సినేషన్ ప్రకాశం జిల్లా చీరాలలో ప్రారంభమైంది. చీరాల పట్టణం వైకుంఠపురంలోని ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. మొదటగా ఆరోగ్య కార్యకర్తకు వాక్సిన్ వేశారు. మొత్తం 15 మందికి తొలివిడత వాక్సిన్ వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.

కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి వాక్సిన్ అందుబాటులోకి రావడం శుభపరిణామమని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. ముందుగా టీకా వేయించుకుని తామే ప్రజలకు ధైర్యం చెబుతున్నామని.. టీకా వేయించుకున్న ఆశా కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు.

అద్దంకిలో..

addanki mla
వైద్యులతో అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్

అద్దంకి నియోజకవర్గంలో కొరిసపాడు, అద్దంకి ప్రభుత్వ వైద్యశాలల్లో కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. అద్దంకి వైద్యశాలలో వాక్సినేషన్​ కార్యక్రమాన్ని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. టీకా ఎవరికి వేయాలి.. టీకా వేసిన వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే పలు విషయాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.

అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు 500 టీకాలు వచ్చాయని ఐదు రోజుల పాటు కొవిడ్ వారియర్స్​కు వ్యాక్సిన్ అందజేయడం జరుగుతుందని వైద్యులు తెలిపారు.

గిద్దలూరులో..

mla anna rambabu
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణం శెట్టి పల్లి గ్రామంలో కరోనా వైరస్ నివారణకు తొలివిడత వాక్సినేషన్ ప్రక్రియ పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొన్నారు. కరోనా వైరస్​ను ఎదుర్కోవడంలో వైద్య సిబ్బంది ఎనలేని కృషి చేశారని అన్నారు. వారి కృషిని గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదటగా ఆరోగ్య సిబ్బందికి టీకా ఇవ్వడాన్ని ఆయన కొనియాడారు.

దర్శిలో..

darshi
టీకా వేయించుకుంటున్న మోహన్ శివకుమార్​ డాక్టర్

దర్శి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు కరోనా నివారణ టీకాను మండల ప్రత్యేకాధికారి అర్జున్​ నాయక్, ఎంపీడీఓ శోభన్ బాబులు ప్రారంభించారు. దర్శిలో శనివారం 10 మందికి టీకా వేశారు. తొలి టీకాను డాక్టర్ మోహన్ శివకుమార్​కు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ ఆనందబాబు టీకా ఇచ్చారు. టీకాను వేయించుకున్న వారికి ఎటువంటి సమస్యలు కలుగలేదని వైద్యులు తెలిపారు.

కనిగిరిలో..

kanigiri
టీకా వేస్తున్న డాక్టర్ సునీత

ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణ కమ్యూనిటీ ఆసుపత్రిలో మొదటి విడత కరోనా వ్యాక్సిన్​ను కనిగిరి వైద్యాధికారులు విజయవంతంగా నిర్వహించారు. మొదటిగా కమ్యూనిటీ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సునీత ప్రారంభించారు. కనిగిరి ప్రాంతంలో మొదటిగా కరోనా టీకాను డాక్టర్ సుబ్బారెడ్డికి, డాక్టర్ ప్రవీణ్​కు వేసి ఒక అరగంట వరకు పరిశీలన నిమిత్తం ప్రత్యేక గదిలో ఉంచారు. కనిగిరిలో మొత్తం 20 మందికి కరోనా టీకా వేసినట్లు డాక్టర్ సునీత తెలిపారు.

ఇదీ చదవండి: కొవిడ్​ జ్ఞాపకాలు తలచుకొని మోదీ కన్నీటిపర్యంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.