ETV Bharat / state

చీరాలలో మరోసారి భగ్గుమన్న వైకాపా వర్గపోరు

author img

By

Published : Dec 26, 2020, 8:36 PM IST

Updated : Dec 26, 2020, 9:38 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలో మరోసారి వైకాపాలో వర్గపోరు బట్టబయలైంది. జిల్లాలోని అక్కయ్యపాలెంలో ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమంలో.. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావు మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సర్దిచెప్పటంతో.. వివాదం సద్దుమణిగింది.

clash between ycp leaders in chirala at prakasam district
చీరాలలో మరోసారి భగ్గుమన్న వైకాపా వర్గపోరు

చీరాలలో మరోసారి భగ్గుమన్న వైకాపా వర్గపోరు

ప్రకాశం జిల్లా చీరాలలో వైకాపా వర్గపోరు భగ్గుమంది. వేటపాలెం మండలం అక్కయ్యపాలెంలో ఇళ్ల స్థలాలు పంపిణీలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావు పాల్గొన్నారు.

పోతుల సునీత 2024లో ఎన్నికలు విషయమై మాట్లాడుతుండగా.. పాలేటి రామారావు అడ్డుకున్నారు. ఈ సంఘటనతో.. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కరణం బలరాం సర్దిచెప్పిన అనంతరం వివాదం సద్దుమణిగింది.

ఇదీ చదవండి:

ఇళ్ల పట్టాలు ఇచ్చేది జగనన్న కాదు చంద్రన్న అట!

Last Updated : Dec 26, 2020, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.