ETV Bharat / state

సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి సేవలో.. ప్రవీణ్ ప్రకాష్

author img

By

Published : Jan 12, 2021, 11:39 AM IST

సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Chief Minister's Office Principal Secretary Praveen Prakash
సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి సేవలో ప్రవీణ్ ప్రకాష్

ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్.. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. నెల్లూరులో జరిగిన అమ్మఒడి బహిరంగ సభకు ముఖ్యమంత్రి జగన్​ తో పాటుగా హాజరైన ఆయన.. తిరుగు ప్రయాణంలో సింగరకొండ క్షేత్రానికి వెళ్లారు.

ఆలయ సహాయ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ప్రవీణ్ ప్రకాష్​కు స్వాగతం పలికారు. ధ్వజస్తంభం, గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జేసీలు చేతన్ మురళీకృష్ణ, ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, తాహసీల్దార్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

చీరలందు ఈ 'గడ్డి చీర' వేరయా.. ఉతికితే.. ఎలా మరి?

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.