ETV Bharat / state

ఇంజినీరింగ్ విద్యపై అవగాహన సదస్సు

author img

By

Published : Mar 9, 2021, 5:43 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇంజినీరింగ్ విద్యపై ఈనాడు-ఈటీవీ సౌజన్యంతో చైతన్య కళాశాల 'దశ - దిశ' అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

KL. University Awareness Seminar
ఇంజినీరింగ్ విద్యపై అవగాహన సదస్సు

వంద ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో, హరిత వనంలా పరిఢవిల్లుతున్న కె.ఎల్. విశ్వవిద్యాలయం విద్యార్థుల భవిషత్తుకు బంగారు బాట వేస్తుందని ఆ విద్యా సంస్థల క్వాలిటీ విభాగం డీన్‌ కె. రామకృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈనాడు - ఈటీవి సౌజన్యంతో చైతన్య కళాశాల 'దశ - దిశ' అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

తమ విద్యా సంస్థలో పరిశోధనకు, ఆవిష్కరణలకు పెద్ద పీట వేస్తున్నామని.. మన దేశం నుంచే కాకుండా, ఇతర దేశాల విద్యార్థులు కూడా ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారని అన్నారు. ఉద్యోగం కావాలనుకున్న వారికి శత శాతం ప్లేస్‌మెంట్‌ ఇస్తున్నామని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పూర్తి సౌకర్యాలతో సంస్థ విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన ఎజెండాగా పనిచేస్తుందన్నారు.

విద్యార్థి వ్యక్తిత్వ వికాశానికి కె.ఎల్. యునివర్సిటీ ఎంతో కృషిచేస్తోందని ఎమ్​హెచ్​ఎస్​ డీన్​ఎమ్​ కిషోర్​బాబు అన్నారు. అతి కొద్ది రోజుల్లో కేఎల్​ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి శాటిలైట్‌ ప్రయోగం చేస్తున్నామని, దీని తయారీలో 75 శాతం మంది విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు. విదేశీ విద్యా సంస్థల కలియికతో ఇంటర్న్​షిప్‌, ప్లేస్‌మెంట్లు కల్పిస్తున్నామన్నారు.

ఇంటర్‌ తరువాత అనేక కోర్సులు చేసుకునే అవకాశం ఉన్నాయని చైతన్య కళాశాల ప్రిన్సిపాల్‌ జి.వెంకయ్య పేర్కొన్నారు. ఒంగోలు ఈనాడు యూనిట్‌ ఇన్‌ఛార్జ్​ ఖాన్‌ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీడీప్‌లో బహుమతులు పొందిన ఇద్దరు విద్యార్థులకు మొబైల్ ఫోన్లు బహుకరించారు.


ఇదీ చదవండి: రేణుక ధైర్యానికి సలామ్: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.