ETV Bharat / state

కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు: అచ్చెన్నాయుడు

author img

By

Published : Jul 20, 2021, 9:53 AM IST

తెదేపా నాయకులపై దాడులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండిచారు. ప్రజా మద్దతుతో గెలిచిన నాయకులను వైకాపా నాయకులు వేధిస్తున్నారని మండిపడ్డారు. తమ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని.. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

atchannaidu fire on ysrcp
అచ్చెన్నాయుడు

ఒంగోలు 26వ డివిజన్ కార్పొరేటర్ రవితేజను వైకాపా నేతలు వేధిస్తూ, అనేక ఇబ్బందులు పెడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఎన్నికలయ్యాక కూడా ఇంకా వేధిస్తున్నారని మండిపడ్డారు. చేతనైతే ప్రజామద్ధతుతో గెలవాలని.. వైకాపా నేతల చిల్లర రాజకీయాలను ఖండిస్తున్నట్లు తెలిపారు. రవితేజ ఇంట్లోని మహిళలతో నీచంగా ప్రవర్తించారని ఆరోపించారు.

ఆ దుర్మార్గులను గుర్తించి వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా బాధితులమీద, సంబంధం లేని వారి మీద తిగిరి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తమ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అంతకు అంత మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

PAWAN: ఉన్న ఉద్యోగాలూ యువతకు ఇవ్వరా?: పవన్ కల్యాణ్

NOTICE: 'అచ్చెన్నాయుడు హాజరై వివరణ ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.