ETV Bharat / state

అద్దంకిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

author img

By

Published : Oct 7, 2020, 12:13 PM IST

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని గరటయ్య కాలనీ సమీపంలో ఈ ఘటన జరిగింది.

person died in road accident
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం గరటయ్య కాలనీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు. మృతుడు కోనకనమిట్ల మండలం చిన్నారికట్ల గ్రామవాసిగా గుర్తించారు. విజయవాడలో బేకరిలో పనిచేసే అంకమ్మరావు స్వస్థలానికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

ఘటనపై అద్దంకి ఎస్సై మహేశ్​ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: 12లోపు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేయాలి: కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.