ETV Bharat / state

న్యాయం కోసం.. భర్త ఇంటి ముందు భార్య ఆందోళన!

author img

By

Published : Jun 26, 2021, 9:59 AM IST

పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన మూడు నెలలకే కువైట్​కు వెళ్లాడు. కొద్ది రోజులు బాగానే మాట్లాడాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. ఏం చేయాలో దిక్కు తోచని ఆమె.. భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

protest
ఆందోళన

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టింది. పెళ్లైన మూడు నెలలకే భర్త కువైట్​కు వెళ్లగా... అత్తింటి వారు వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కొరుటూరు గ్రామానికి చెందిన సైదానికి ఇందుకూరుపేటకు చెందిన హనీఫ్​తో అయిదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన మూడు నెలలకే ఉద్యోగం పేరుతో కువైట్​కు వెళ్లిన భర్త, కొంత కాలం ఫోన్​లో అందుబాటులో ఉన్నాడని... తర్వాత ముఖం చాటేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

భర్త రావాలంటే రూ.ఐదు లక్షలు తేవాలని అత్తింటి వారు వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె వాపోయింది. ఇప్పుడు భర్తకు ఫోన్ చేస్తే తనకు కువైట్​లో పెళ్లి అయిందని చెప్పడంతో దిక్కుతోచని ఆమె అత్తింటి ఎదుట బైఠాయించింది. పోలీసు స్టేషన్​కు వెళ్లి తనకు న్యాయం చెయ్యాలంటూ ధర్నా నిర్వహించింది. గతంలోనూ ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి:

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆగ్రహం..మామ, కూతురిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.