ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం వద్ద వీఆర్వోలు నిరసన చేపట్టారు. తమకు ఉద్యోగాల్లో పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. బయోమెట్రిక్ విధానంలో మార్పులు తీసుకురావాలని కోరారు.
కొవిడ్ విధుల్లో తమ పాత్రను కూడా గుర్తించాలని ఆర్డీవో సువర్ణమ్మకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆమెకు వినతిపత్రం అందజేశారు. డివిజన్లోని 10 మండలాలకు చెందిన వీఆర్వోలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: