ETV Bharat / state

హైదరాబాద్​లో మరోసారి ఐటీ దాడుల కలకలం

author img

By

Published : Jan 18, 2023, 2:01 PM IST

IT Raids in Hyderabad
IT Raids in Hyderabad

IT Raids in Hyderabad : తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ నగరంలోని పలు స్తిరాస్థి సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. శ్రీ ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఊర్జిత కన్​స్ట్రక్షన్స్, సీఎస్​కే బిల్డర్స్ తదితర సంస్థల డైరెక్టర్లు, సీఈవోల ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి.

IT Raids in Hyderabad : తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. మూడు రియల్ ఎస్టేట్ సంస్థలపై ఈ ఉదయం నుంచి ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో దాదాపు 50 బృందాలు పాల్గొన్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. శ్రీ ఆదిత్య హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటారెడ్డి, అతని కుమారుడు ఆదిత్య రెడ్డి ఇళ్లతో పాటు ఈ సంస్థల ప్రధాన కార్యాలయాలతో పాటు వాటి అనుబంధ సంస్థలు, బంధువులు, స్నేహితుల ఇళ్లపైనా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మూడు రోజుల పాటు: ఈ సంస్థలు నిర్వహిస్తున్న స్తిరాస్థి వ్యాపారానికి, అవి చెల్లిస్తున్న ఆదాయ పన్నుకు పొంతన లేకపోవడంతో దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన అధికారులు.. ఆయా సంస్థలపై కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్‌, కూకట్‌పల్లిలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి నుంచి కనీసం మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ట్యాక్స్ ఎగవేత: ప్రముఖ వ్యాపారవేత్త ఊర్జిత కన్​స్ట్రక్షన్స్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో, కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కుత్బుల్లాపూర్ కొంపల్లిలోని ఊర్జిత కన్​స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న విల్లాల్లో ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు ట్యాక్స్ ఎగవేత విషయంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.