ETV Bharat / state

'కార్పొరేట్ వ్యక్తులకు లబ్ధి చేకూరేలా కేంద్ర ప్రభుత్వ పాలన'

author img

By

Published : Mar 4, 2021, 12:49 PM IST

పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ నెల్లూరులోని ఇందిరా భవన్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. కార్పొరేట్ వ్యక్తులకు లబ్ధి చేకూరేలా కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

The Congress party staged a protest in Nellore against rising oil prices
'కార్పొరేట్ వ్యక్తులకు లబ్ధి చేకూరేలా కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తుంది'

పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇందిరా భవన్ ఎదుట కట్టెల పొయ్యిపై వంట చేస్తూ వినూత్నంగా ధర్నా నిర్వహించారు. సామాన్యులపై భారం మోపుతూ.. కార్పొరేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి ఆరోపించారు. చమురు ధరల పెంపుతో నిత్యావసర సరుకుల రేట్లపై ప్రభావం పడనుందని అన్నారు. దీంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల భారాన్ని తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు ముఖ్యమంత్రి జగన్ పోరాటం చేయాల్సిన అవసరముందని దేవకుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: హత్యకేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.