ETV Bharat / state

వెంకటగిరిలో తెదేపా నేతల కాగడాల ప్రదర్శన

author img

By

Published : Jun 14, 2020, 10:54 PM IST

తెదేపా నేతల అరెస్టు సంచలనం రేపుతోంది. అరెస్టులకు నిరసనగా.. తెదేపా నాయకులు కాగడాల ప్రదర్శన చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తేదేపా నేత, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేశారు.

tdp leaders protest in nellore dst about  arrest of ex mlas
tdp leaders protest in nellore dst about arrest of ex mlas

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేశారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్​లను అరెస్టు చేయటం వెనుక ముఖ్యమంత్రి కక్షపూరిత ధోరణి ఉందని ఆరోపిస్తూ ఆందోళనలు చేశారు.

ఎన్టీఆర్ కాలనీ నుంచి క్రాస్ రోడ్డు వరకు తెదేపా శ్రేణులు కాగడాల ప్రదర్శన సాగించారు. తెదేపా నాయకులపై కేసులు తొలగించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి

తొమ్మిదో తరగతి కుర్రాడు.. బైక్​నే సృష్టించాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.