ETV Bharat / state

సింగరాయకొండలో చంద్రబాబుకు ఘన స్వాగతం.. బైక్​ ర్యాలీగా కందుకూరుకు

author img

By

Published : Dec 28, 2022, 5:32 PM IST

CHANDRABABU NELLORE TOUR : నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. కందుకూరులో జరగనున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి బహిరంగ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు. సింగరాయకొండ బైపాస్ నుంచి బైక్ ర్యాలీగా చంద్రబాబు కందుకూరుకు బయలుదేరారు.

CHANDRABABU NELLORE TOUR
CHANDRABABU NELLORE TOUR

CBN NELLORE TOUR : నెల్లూరు జిల్లా సింగరాయకొండలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. సింగరాయకొండ బైపాస్ నుంచి బైక్ ర్యాలీగా చంద్రబాబు కందుకూరుకు బయలుదేరారు. కందుకూరులో జరగనున్న'ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి' బహిరంగ సభకు హాజరవుతారు. అంతకుముందు సింగరాయకొండ చేరుకున్న బాబు.. అండర్ పాస్ వద్ద టీ స్టాల్‌లో టీ తాగారు. అక్కడ చిరు వ్యాపారులతో ముచ్చటించి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధరల పెంపుతో ఇబ్బందులు పడుతున్నామని చంద్రబాబుకు టీస్టాల్‌ నిర్వాహకురాలు తెలిపారు.

ప్రకాశం జిల్లా కొండెపి టోల్​గేట్​ వద్ద భారీ గజమాలతో స్వాగత ఏర్పాట్లు: అంతకుముందు నెల్లూరు జిల్లా పర్యటనకు బయలుదేరిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు దారి పొడవునా.. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా త్రోవగుంట వద్ద దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు స్వాగతం పలికారు. కొండెపి టోల్‌గేట్ వద్ద దామచర్ల సత్య భారీ గజమాలతో స్వాగతోత్సవ ఏర్పాట్లు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.