ETV Bharat / state

నెల్లూరు నగరాన్ని సుందరంగా మారుస్తాం: మంత్రి అనిల్

author img

By

Published : Feb 21, 2021, 10:32 PM IST

నెల్లూరు నగరాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు. ఆహ్లాదకరమైన పార్కులు, పచ్చదనంతో కూడిన రోడ్డు వ్యవస్థ రూపొందించేందుకు తగిన ప్రణాళికలను రచిస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసి సుందరమైన నగరాన్ని ప్రజలకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

nellore city
నెల్లూరు నగరాన్ని సుందరంగా మారుస్తాం_ మంత్రి అనిల్

నెల్లూరు నగరాన్ని సుందరంగా మారుస్తాం_ మంత్రి అనిల్

నెల్లూరు నగరాన్ని సుందరంగా మార్చేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. నగరంలోని ప్రధాన రోడ్లులో పచ్చదనం.. పార్కులు ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లదకరమైన వాతావరణం కల్పించనున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్​ ప్రత్యేక శ్రద్ద చూపించటంతో నిధులకు కొరత లేకుండా పనులు వేగంగా జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

తొమ్మిది లక్షల జనాభా కలిగిన నెల్లూరును.. పచ్చదనంతో నింపేందుకు యోచిస్తున్నారు. ఈ నగరాన్ని స్వచ్ఛనగరంగా మార్చేందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్​ కుమార్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. నిత్యం నగరంలో ఎదురౌతున్న పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఆసుపత్రులు ఎక్కువగా ఉండే పొగతోటను సుందరంగా మార్చనున్నారు. బృందావనం, నర్తకీ సెంటర్, బైపాస్ రోడ్డు ప్రాంతాలను అభివృద్ధి కోసం ఏర్పాట్లు చేశారు. ఈ పనులను ఏ సమయంలోపు పూర్తి చేయాలన్న దానిపై అధికారులతో మంత్రి చర్చించారు. అలాగే మురుగు పారుదల వ్యవస్థను మెరుగుపరచి.. పూర్తి స్థాయిలో కాలువల నిర్మాణం చేపట్టనున్నారు.

ఇదీ చదవండి:

రాజమహేంద్రవరంలో సందడి చేసిన మెగాస్టార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.