ETV Bharat / state

Rottela Pandaga 2023: వైభవంగా నెల్లూరులో రొట్టెల పండగ.. పెరిగిన భక్తుల తాకిడి

author img

By

Published : Jul 30, 2023, 10:33 AM IST

Nellore Bread Festival: నెల్లూరు నగరంలో ప్రతియేటా వైభవంగా నిర్వహించే రొట్టెల పండగ ప్రారంభమైంది. ఐదు రోజులపాటు సాగనున్న ఈ ఉత్సవాలు నేడు రెండవ రోజుకు చేరుకున్నాయి. నెల్లూరు దర్గాలో నిర్వహించే ఈ ఉత్సవాలకు మతాలకు ఆతీతంగా భక్తులు తరలివస్తున్నారు.

నెల్లూరు రొట్టెల పండగ
నెల్లూరు రొట్టెల పండగ

వైభవంగా నెల్లూరులో రొట్టెల పండగ.. పెరిగిన నభక్తుల తాకిడి

Rottela Pandaga In Nellore: నెల్లూరులో ఐదు రోజుల పాటు సాగే రొట్టెల పండుగకు భక్తులు పోటెత్తారు. ఏటా బారాషాహీద్ దర్గా వద్ద నిర్వహించే రొట్టెల పండగను వీక్షించేందుకు హిందూ, ముస్లీం అనే తారతామ్యలు లేకుండా మతాలకు అతీతంగా భక్తులు తరలివస్తారు. ఈ పండుగ తమ నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక అని భక్తులు చెబుతున్నారు. ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగకు 10లక్షలు మందికిపైగా ప్రజలు తరలివస్తారని అధికారులు అంచనా వేశారు.

భారీగా జనం రాకతో స్వర్ణాల చెరువు, దర్గా ప్రాంతం కిక్కిరిసింది. ఆరోగ్యం, వివాహం, ఉద్యోగం, ఐశ్వర్యం వంటి అనేక కోర్కెలతో భక్తులు వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా.. 2వేల 5వందల మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు నిర్వహిస్తున్నారు. రెండో రోజైన ఆదివారం గంధోత్సవం కావడంతో రాత్రి నుంచి భక్తులు నెల్లూరు నగరానికి తరలివచ్చారు. ఈ ఒక్క రోజు రెండు లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం రోజున ప్రధాన రొట్టెల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

టీడీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఈ రొట్టెల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నారు. బారాషాహీద్ దర్గాను ఆనుకుని ఉన్న భక్తులు స్వర్ణాల చెరువులో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఏపీనుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాకిడి అధికమైతే.. రొట్టెల పండుగ ఉత్సవాలను మరో రెండు రోజులు పొడిగించే అవకాశం ఉంటుంది.

కోరినా కోరికలు నేరవేరుతాయని అందుకే ఇక్కడకు వస్తున్నట్లు భక్తులు తెలిపారు. అక్కడే పుట్టి పెరిగిన వారు.. ఇతర ప్రాంతాలకు వెళ్లిన కూడా రొట్టెల పండుగను మర్చిపోకుండా వస్తున్నారు. గతంలో ఇంత వైభవంగా ఉండేది కాదని.. ఇప్పుడు ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నారని భక్తులు అంటున్నారు. తాము కోరినా కోరికలు నేరవేరటానికి రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు భక్తులు వివరించారు.

"నేను గత ఐదు సంవత్సరాలు వస్తున్న. ఇంట్లో పశుసంపద వృద్ధి చెందాలని వచ్చాను. ఆ తర్వాత పంట చేలు భాగుండాలని వచ్చాను. అవన్నీ నేరవేరాయి. అందుకే మళ్లీ ఈ సంవత్సరం కూడా ఉత్సవాలకు వచ్చాను." -భక్తులు

"నేను ఇక్కడే పుట్టి పెరిగాను. చదివింది కూడా ఇక్కడే. అప్పటి నుంచి వస్తున్నాము. అప్పుడు ఇలా ఉండేది కాదు. అంతేకాకుండా పండగ ఎలా చేసుకుంటారో మాకు తెలిసేది కాదు. ఇక్కడే వస్తున్నకొద్ది మాకు పండగ గురించి తెలిసింది." -భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.