ETV Bharat / state

క్వారంటైన్, క్లీనిక్ కేంద్రాలను ప్రారంభించిన కలెక్టర్

author img

By

Published : Jul 9, 2020, 10:38 PM IST

నెల్లూరు జిల్లా తూర్పుకనుపూరులో క్వారంటైన్, క్లీనిక్ కేంద్రాలను కలెక్టర్ శేషగిరిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి, గూడూరు ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలోని పారిశ్రామిక వాడల్లో వీటిని ఏర్పాటు చేస్తామని జిల్లా పాలనాధికారి ప్రకటించారు.

Quarantine, clinic centers starts by district collecte in nellore district
క్వారంటైన్, క్లీనిక్ కేంద్రాలను ప్రారంభించిన కలెక్టర్

పారిశ్రామిక ప్రాంతాల్లో క్వారంటైన్, క్లీనిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని నెల్లూరు జిల్లా పాలనాధికారి శేషగిరిబాబు వెల్లడించారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో ఉన్న నవనీత పాఠశాలలో ఏర్పాటు చేసిన.. క్వారంటైన్, క్లీనిక్ కేంద్రాన్ని కలెక్టర్, ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, వరప్రసాద్ ప్రారంభించారు.

ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సూచనతో క్లీనిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ అన్నారు. ఇందుకు సహకరించిన కృష్ణపట్నం పోర్ట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో నాయుడుపేట, తడలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఎమ్మెల్యే గోవర్ధన్​రెడ్డి అన్నారు. తీర ప్రాంతమైన కనుపూరులో ఏర్పాటైన ఈ కేంద్రం వల్ల ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు.. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సదుపాయం అందుతుందని గూడూరు శాసనసభ్యుడు వరప్రసాద్ పేర్కొన్నారు.

ఇదీచదవండి. : అధికారుల దురుసు ప్రవర్తన... దళితుడి ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.