ETV Bharat / state

భార్యను దారుణంగా హతమార్చిన భర్త

author img

By

Published : Apr 24, 2021, 3:46 PM IST

Updated : Apr 24, 2021, 5:35 PM IST

కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హతమార్చాడో భర్త. కుటుంబాల కారణంగా వివేకం కోల్పోయి.. సవకతోటలోకి తీసుకెళ్లి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేస్తూ ఆ ఇల్లాలు ప్రాణాలు వదిలింది. నెల్లూరు జిల్లా గూడూరులోని వేములపాలెంలో ఈ ఘటన జరిగింది.

petro murder in savakathota, person killed his wife with petrol
సవకతోటలో పెట్రో హత్య, భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

నెల్లూరు జిల్లా గూడూరులో దారుణం జరిగింది. శ్రీహరి అనే వ్యక్తి తన భార్య సుజాతపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వేములపాలెం సమీపంలోని సవకతోటలో ఈ హత్యకు పాల్పడ్డాడు. వారికి ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఆమెను హతమార్చాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

ఇదీ చదవండి:

నాలుగు గంటలు అంబులెన్సులోనే మహిళ.. శ్వాస ఆడక మృతి

Last Updated : Apr 24, 2021, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.