ETV Bharat / state

'మహిళలు నిర్భయంగా ఉండేందుకే దిశ యాప్.. సద్వినియోగం చేసుకోండి'

author img

By

Published : Jul 4, 2021, 8:52 PM IST

mla anam
ఎమ్మెల్యే ఆనం

మహిళలు నిర్భయంగా బ్రతకాలనే ఆశయంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి.. దిశ యాప్​ ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దిశ యాప్ సామూహిక డౌన్ లోడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దిశ యాప్ సామూహిక డౌన్ లోడ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. మహిళలు నిర్భయంగా బ్రతకాలనే ఆశయంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి.. దిశ యాప్​ ప్రవేశపెట్టారని అన్నారు. దిశ యాప్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఆ మన్నెం వీరుడి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా బాలికల నృత్యాలు అలరించాయి. తిరుపతి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గురుమూర్తి, ఎస్పీ వెంకటరత్నం, జిల్లాలోని వివిధ స్థాయిల పోలీస్ అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఇంటి నిర్మాణం కోసం..ఆత్మాభిమానం పక్కన పెట్టి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.