ETV Bharat / state

తెలంగాణ: లాక్​డౌన్​లో 1400 కి.మీ వెళ్లింది... కొడుకును తెచ్చుకుంది

author img

By

Published : Apr 9, 2020, 8:45 PM IST

స్నేహితుడితో కలిసి కొడుకు వేరే రాష్ట్రానికి వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో... కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​ను విధించాయి. అంతే ఆ తల్లి కొడుకును చూసేందుకు తల్లడిల్లిపోయింది. తనను ఎలాగైనా ఇంటికి తీసుకురావాలనుకుంది. ఇంతకీ కొడుకును తీసుకొచ్చేందుకు ఆమె ఏమి చేసింది? ఇంటికి తీసుకెళ్లిందా? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

mother drives 1400 kilometers  at nizamabad
లాక్​డౌన్​లో 1400 కి.మీ వెళ్లింది... కొడుకును తెచ్చుకుంది

లాక్​డౌన్​లో 1400 కి.మీ వెళ్లింది... కొడుకును తెచ్చుకుంది

సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు. ఆమె పంచే ప్రేమకు అంతే లేదని ఓ తల్లి మరోసారి రుజువు చేసింది. తెలంగాణ నిజామాబాద్​ జిల్లా బోధన్​కు చెందిన రజియా బేగం ప్రభుత్వ పాఠశాలలో టీచర్​గా పని చేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో చిన్నవాడైన నిజాముద్దీన్ ఇంటర్​ పూర్తి చేసి హైదరాబాద్​లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇటీవలె బోధన్ వచ్చిన నిజాముద్దీన్... స్నేహితుడి తండ్రి ఆరోగ్యం బాగాలేదని తెలిసి మార్చి 12న అతనితో నెల్లూరు వెళ్లాడు.

అక్కడ నుంచి మొక్కులు తీర్చుకునేందుకు రహమతాబాద్​ దర్గాకు వెళ్లాడు. ఇదే సమయంలో ప్రభుత్వం లాక్​డౌన్​ విధిచండంతో అక్కడే చిక్కుకుపోయాడు. విషయం తెలుసుకున్న తల్లి రజియా ఆందోళన చెందింది. కొడుకు ఎలాగైనా ఇంటికి తీసుకురావాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఏసీపీ జయపాల్ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించింది.

లాక్​డౌన్​లో 1400 కి.మీ వెళ్లింది... కొడుకును తెచ్చుకుంది

ఏసీపీ ఇచ్చిన లెటర్​తో 1400కి.మీ ప్రయాణం

ఏసీపీ ఇచ్చిన లెటర్ తీసుకుని... స్కూటీపై రహమతాబాద్​కు బయలుదేరింది. సోమవారం ఉదయం 6 గంటలకు స్కూటీపై ప్రయాణాన్ని ప్రారంభించి... మంగళవారం మధ్యాహ్ననికి చేరుకుంది. కుమారుడిని తీసుకుని వెంటనే బయల్దేరింది. మరుసటిరోజు మధ్యాహ్నానికి కామారెడ్డి చేరుకుంది. కన్నకొడుకు కోసం రానూపోనూ దాదాపు 1400 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణించింది.

కొడుకును చూడాలనే తపనే తనను అంత దూరం వెళ్లేలా చేసిందని రజియా తెలిపింది. దీనికి సహకరించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇదీ చూడండి: అప్రమత్తంగా లేకుంటే ముప్పే: యూకేలో స్థిరపడిన భారతీయ వైద్యుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.